ETV Bharat / bharat

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో 11 మందికి కరోనా

దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకూ అధికమవుతూనే ఉంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని శ్రమశక్తి భవన్​లో మరో 11 మంది సిబ్బందికి కొవిడ్​-19 సోకినట్లు సమాచారం. గత వారమే ఇద్దరికి వైరస్​ సోకినందున ఇప్పటికే రెండు రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేశారు అధికారులు.

11 Employees in  Union Labor and Employment Ministry tests postive for Covid-19
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో 11 మందికి కరోనా!
author img

By

Published : Jun 7, 2020, 7:41 PM IST

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో 11 మంది ఉద్యోగులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. అదే కార్యాలయంలో పనిచేస్తోన్న ఇద్దరికి గత వారమే వైరస్​ సోకింది. ఫలితంగా రెండు రోజుల పాటు కార్యాలయాలన్ని మూసివేసిన అధికారులు.. శానిటైజింగ్​ చేస్తున్నట్లు తెలిపారు.

ఆ 11 మంది వీరే..

ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. మరో 11 మందికి వైరస్​ పాజిటివ్​ వచ్చినట్లు తెలుస్తోంది. కొవిడ్​-19 సోకిన వారిలో సంయుక్త కార్యదర్శి, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ, మరో ప్రైవేట్ సెక్రటరీలతో సహా.. ఆరుగురు మల్టీటాస్కింగ్ అసిస్టెంట్లు, ఓ డ్రైవర్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కార్యాలయంలో శానిటైజింగ్​ పనులు పూర్తయినందున రేపటి నుంచి కార్యాలయాన్ని తెరిచేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇంతలోనే ఇలా కరోనా కేసులు బయటపడటం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో 86శాతం దొంగ కరోనా కేసులే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.