ETV Bharat / bharat

స్వయంకృషికి చిరునామా.. ఈ వందేళ్ల బామ్మ - చెప్పులు కుట్టేవందేళ్ల బామ్మ

గజియాబాద్​లో ఓ వందేళ్ల బామ్మ చేసే పనేంటో తెలిస్తే.. సలాం అంటారు. అవును.. వయసును లెక్కచేయకుండా ప్రతిరోజూ తెగిన చెప్పులు కుడుతూ, బూట్లు పాలిష్​ చేస్తోందామె. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా విశ్రాంతి తీసుకోదు. ఎందుకో తెలుసా?

100 Yrs Old Woman Shoe Polishes In Ghaziabad
స్వయంకృషికి చిరునామా.. ఈ వందేళ్ల బామ్మ
author img

By

Published : Mar 16, 2020, 6:49 AM IST

స్వయంకృషికి చిరునామా.. ఈ వందేళ్ల బామ్మ

'ఎవరేమన్నా సరే.. నా పని నేనే చేస్తా' అంటూ చకచకా చెప్పులు కుట్టేస్తోంది వందేళ్ల చంద్రోదేవీ బామ్మ.

ఉత్తర్​ప్రదేశ్​ గజియాబాద్​కు చెందిన చంద్రో బామ్మ వందేళ్ల వయసు మీద పడ్డా.. ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా టంచనుగా దుకాణం తెరుస్తుంది. బూట్లకు పాలీష్​ చేసేస్తుంది. తెగిన చెప్పులను కుట్టేస్తుంది. ఇలా ఒకటీ, రెండు రోజులు కాదు.. దాదాపు ఆరు దశాబ్దాలుగా ఇదే ఆమె దినచర్య. అందుకే మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ బామ్మ ఎంతో ఫేమస్.

ఆత్మవిశ్వాసంతో దుకాణాన్ని నడుపుతూ స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ బామ్మ. కుటుంబసభ్యులు ఈ పని మానేసి ఇంట్లో కూర్చోమంటే చంద్రో మాత్రం ససేమిరా అంటోంది. ఒంట్లో శక్తి ఉన్నంతవరకు పని చేస్తే తప్పేంటని వారితో వాదిస్తోంది. తన దగ్గర ఏమి లేనప్పుడు ఈ పని చేసే కుటుంబాన్ని పోషించినప్పుడు..ఇప్పుడెందుకు మానేయాలి అని ప్రశ్నిస్తోంది.

"నాకు ఇంట్లో కూర్చోవాలంటే మనసొప్పదు. దుకాణానికి వస్తే 50 నుంచి 100 రూపాయలు సంపాదిస్తాను. అందుకే ఇలా చెప్పులు కుడతున్నాను. నాకు కొడుకు, కోడలు అందరూ ఉన్నారు. అయితే మాత్రం, నేను ఎందుకు నా పనిని వదిలేయాలి? దాదాపు 60 ఏళ్లుగా నేను ఇదే పని చేస్తున్నా."

-చంద్రోదేవీ

వందేళ్ల వయసులోనూ తన వృత్తిని గౌరవిస్తూ.. ఇంత ఉత్సాహంగా పని చేస్తున్న చంద్రోదేవీ బామ్మ ఈ తరానికి ఎంతో ఆదర్శం.

ఇదీ చదవండి:కరోనా శాంతికి.. హనుమాన్​ మహాయజ్ఞం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.