ప్రాణాంతక కరోనా ఇప్పటికే లక్షలాది మందిని బలి తీసుకుంది. అందులో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. అయితే అసోం గువహటిలోని ఓ వృద్ధాశ్రమంలో ఉండే వందేళ్ల బామ్మ కరోనా నుంచి కోలుకొని... ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది. ఆమె మహమ్మారి నుంచి కోలుకొని మంచి పాఠం నేర్పిందని ట్వీట్ చేశారు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత విశ్వశర్మ.
"కరోనా నుంచి కోలుకున్న వందేళ్ల మేయీ హందిక్వీ మనకు గొప్ప స్ఫూర్తి. వైద్యులు అత్యున్నత సేవల వల్ల మహమ్మారితో పోరులో గెలిచి... సంకల్ప బలం గొప్పదనే పాఠాన్ని నేర్పారు. ఆమె తిరిగి వృద్ధాశ్రమానికి క్షేమంగా చేరుకొని, తన వారితో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను."
- హిమంత విశ్వశర్మ, అసోం రాష్ట్ర ఆరోగ్య మంత్రి
ఇటీవల కర్ణాటకలోనూ వందేళ్ల బామ్మ వైరస్ను నుంచి కోలుకొని ఆ రాష్ట్రంలో వైరస్ నుంచి రికవరీ అయిన అత్యంత ఎక్కువ వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.
ఇదీ చూడండి: విద్యార్థుల దగ్గరకే పాఠాలు- బైకు మీద క్లాసులు