ETV Bharat / bharat

నేడు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. 10 మందికే చోటు

author img

By

Published : Feb 6, 2020, 5:06 AM IST

Updated : Feb 29, 2020, 8:52 AM IST

నేడు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప. ఇటీవల భాజపాలో చేరి ఉప ఎన్నికల్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 10:30 గంటలకు రాజ్​భవన్​లో ప్రమాణం చేయనున్నారు ఎమ్మెల్యేలు.

10 MLAs to be inducted into Yediyurappa cabinet
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ

నేడు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.

కర్ణాటక మంత్రివర్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప నేడు విస్తరించనున్నారు. కాంగ్రెస్​, జేడీఎస్​ నుంచి భాజపాలో చేరి గత డిసెంబర్​లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన వారిలో 10 మందికి ఈసారి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా అనుకున్నట్లుగా 13 మంది కాకుండా 10 మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు యడియూరప్ప.

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం.. 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు.

"భాజపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్య నేతల సూచన మేరకు 10 మంది మాత్రమే రేపు ప్రమాణం చేస్తారు. త్వరలోనే దిల్లీ వెళ్లి అధిష్ఠానాన్ని కలుస్తాను. మిగతా వారిని కేబినెట్​లోకి తీసుకునే అంశంపై చర్చిస్తా. మంత్రివర్గంలోకి ఉమేశ్​ కట్టిని తీసుకునే అంశంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు మంత్రి పదవి ఇస్తాం.. కానీ ప్రస్తుత విస్తరణలో అది సాధ్యం కాదు. ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పగిస్తాం. "

- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

ప్రస్తుతం కాంగ్రెస్​-జేడీఎస్​ నుంచి వచ్చి గెలుపొందిన 11 మందిలో ఎమ్మెల్యే మహేశ్​ కుమతల్లి ఒక్కడినే పక్కనపెడుతున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి. ఆయన విషయంపై అధిష్ఠానంతో మాట్లాడతానని చెప్పారు.

ఉదయం 10:30కు ప్రమాణం..

మంత్రివర్గంలోకి తీసుకుంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉదయం 10:30 గంటలకు రాజ్​భవన్​లో మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

సందిగ్ధం..

గత ఆదివారం మంత్రివర్గ విస్తరణపై ప్రకటన చేసిన యడియూరప్ప.. 10 మంది కాంగ్రెస్​-జేడీఎస్​ రెబల్​ ఎమ్మెల్యేలు సహా మరో ముగ్గురికి మంత్రివర్గంలో చోటు ఉంటుందని తెలిపారు. కానీ.. ఆశావాహులు ఎక్కువగా ఉన్నందున మంత్రివర్గంలోకి తీసుకునే వారిపై నిర్ణయాన్ని జాతీయ నేతలపై పెట్టారు యడియూరప్ప. ఈ నేపథ్యంలో కొంత సందిగ్ధం నెలకొంది. సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం ఈసారి 10 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. మిగతా వారి విషయంలో జాతీయ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. అందరికీ అవకాశం కల్పిస్తామని భరోసా కల్పించారు.

ప్రస్తుతం 18 మంది మాత్రమే..

కర్ణాటక మంత్రివర్గంలో మొత్తం 34 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 18 మంది మాత్రమే యడియూరప్ప క్యాబినెట్‌లో ఉన్నారు. మరో 16 మందికి అవకాశం ఉండగా నేడు 10 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం కర్ణాటక క్యాబినెట్​లో యడియూరప్పతో సహా 8 మంది లింగాయత్​లు, వక్కలిగలు-3, బ్రాహ్మణ-1, ఎస్సీ-3, ఓబీఎస్​-2, ఎస్టీ-1 ఉన్నారు.

ఇదీ చూడండి: శాడిస్ట్​ భర్త: భార్యపై అనుమానంతో కత్తిరించాడు

Last Updated : Feb 29, 2020, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.