ETV Bharat / bharat

పంజాబ్​లో ఆప్​ శకం.. సీఎంగా భగవంత్​ మాన్ ప్రమాణం

Bhagwant Mann: పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భవగంత్ మాన్​​ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమ్​ ఆద్మీ పార్టీ కన్వీనర్​, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రామనికి హజరయ్యారు.

First AAP CM of Punjab being sworn in
పంజాబ్​ సీఎంగా భగవంత్ మాన్​ ప్రమాణం
author img

By

Published : Mar 16, 2022, 1:27 PM IST

Updated : Mar 16, 2022, 1:47 PM IST

Punjab New CM: పంజాబ్​ ముఖ్యమంత్రిగా ఆమ్​ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్​లో తొలి ఆప్​ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. భగవంత్​ స్వగ్రామం ఖట్కఢ్ కలన్​లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ పంజాబ్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

First AAP CM of Punjab being sworn in
పంజాబ్​లో ఆప్​ శకం.. సీఎంగా భగవంత్​ మాన్ ప్రమాణం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117కు గాను 92 సీట్లు గెలిచి సంచలన విజయం సాధించింది ఆప్. దిల్లీ తర్వాత మరో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జాతీయ రాజకీయాల్లో సరికొత్త శక్తిగా అవతరిస్తోంది.

First AAP CM of Punjab being sworn in
కార్యక్రమానికి హాజరైనా కేజ్రీవాల్​, మనీశ్​ సిసోడియా

జాట్​ సిక్కు కుటుంబానికి చెందిన భగవంత్​ సింగ్​ మాన్​ 1973 అక్టోబరు 17న సంగ్రూర్​ జిల్లా సతోజ్​ గ్రామంలో జన్మించారు. సునమ్​లోని ఉధమ్​ సింగ్​ కాలేజీలో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లో మాన్​ ఎక్కువగా యూత్​ కామెడీ ఫెస్టివల్స్​, ఇంటర్​ కాలేజీ పోటీల్లో పాల్గొనేవారు. 'జుగ్ను ఖేప్నదా', 'జుగ్ను మస్త్​ మస్త్​', 'నో లైఫ్​ విత్​ వైఫ్​' వంటి కామెడీ షోలతో గుర్తింపు పొందారు. 2008లో ఓ ప్రముఖ టీవీ ఛానెల్​ నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న మాన్​.. తన కామెడీతో విశేష ఆదరణ పొందారు. 1992-2015 మధ్య వివిధ కామెడీ, మ్యుజికల్​ ఆల్బమ్స్​ సహా సినిమాల్లో నటించారు. బల్వంత్​ దుల్లత్​ దర్శకత్వంలో తెరకెక్కిన జాతీయ అవార్డు గ్రహీత చిత్రం 'మై మా పంజాబ్​ దీ'లో కూడా భగవంత్​ మాన్​ నటించారు.

First AAP CM of Punjab being sworn in
ఆప్ పంజాబ్ కో ఇంఛార్జ్​తో భగవంత్​ మాన్​

కమెడియన్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి..

కమెడియన్‌గా ఎంతో గుర్తింపు పొందిన భగవంత్‌ మాన్‌.. 2011లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌లో చేరి 2012 శాసనసభ ఎన్నికల్లో లెహ్రా నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరి.. సంగ్రూర్‌ లోక్‌సభ స్థానం నుంచి 2లక్షలకు పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. 2017లో జరిగిన పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో జలాలాబాద్‌ నుంచి పోటీచేసి.. అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్‌ బాదల్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి సంగ్రూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి వరుసగా రెండోసారి విజయం సాధించారు. ప్రస్తుతం లోక్‌సభలో ఆప్‌ తరఫున ఉన్న ఏకైక ఎంపీగా ఉన్న ఆయన.. ఈసారి ధురి శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో మూడోసారి పోటీచేసి తొలిసారి గెలుపొందిన భగవంత్‌ మాన్‌.. ఏకంగా సీఎం పీఠాన్నే అధిరోహించనున్నారు.

First AAP CM of Punjab being sworn in
భగవంత్​ మాన్

మద్యం మానేస్తున్నట్లు ప్రమాణం...

ఎంతో ప్రజాదరణ కలిగిన మాన్‌.. అనేక వివాదాల్లోను చిక్కుకున్నారు. 2016లో ఒకసారి పార్లమెంట్‌ ప్రాంగణాలను లైవ్‌ స్ట్రీమ్‌ చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంట్‌ భద్రతా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒకసారి మద్యం సేవించి లోక్‌సభకు వచ్చారని కొందరు ఎంపీలు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈసారి ఎన్నికల ప్రచారం సమయంలోను ప్రత్యర్థి పార్టీలు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ మాన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. మద్యం మానేస్తున్నట్లు బహిరంగంగా ఆయన ప్రమాణం చేశారు.

First AAP CM of Punjab being sworn in
పంజాబ్​ సీఎంగా భగవంత్ మాన్​ ప్రమాణం

పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో ఈసారి ఎలాగైన విజయం సాధించాలన్న లక్ష్యంతో ఆప్‌ సరికొత్త పంథా ఎంచుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రజల నిర్ణయానికే వదిలేసిన ఆప్‌.. ఇందుకోసం ప్రత్యేకంగా ఓటింగ్‌ నిర్వహించింది. భగవంత్‌ మాన్‌కే 90శాతానికిపైగా ఓట్లు రావటంతో.. ఆయననే సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆ సందర్భంగా.. మాన్‌ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఒకప్పుడు ప్రజలు తనను చూసి నవ్వారని, ఇప్పుడు ఏడుస్తూ సాయం కోసం తమవైపు చూస్తున్నారని పేర్కొన్నారు. పంజాబ్ ప్రజల కోసం తప్పకుండా గెలుస్తామని భగవంత్‌ మాన్ ధీమా వ్యక్తం చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో ఆప్‌ ప్రభంజనం సృష్టించటంతో.. భగవంత్‌ మాన్‌ సీఎం పగ్గాలు చేపట్టారు.

ఇదీ చదవండి: హైకమాండ్​​ ఆర్డర్​.. పీసీసీ చీఫ్​ పదవికి సిద్ధూ రాజీనామా

Last Updated : Mar 16, 2022, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.