బెంగళూరు గ్యాంగ్ రేప్ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం అతడు తప్పించుకునేందుకు యత్నించగా కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది..
బంగ్లాదేశ్‌కు చెందిన యువతి జననాంగంలో సీసాను జొప్పించి, హింసించిన ఘటనలో షోబజ్ ప్రధాన నిందితుడు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయిన క్రమంలో షోబజ్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రీరాంపుర్లోని ఓ తుక్కు గోదాములో షోబజ్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ దేవెందర్ నాయక్, ఓ ఎస్సైపై.. షోబజ్ దాడి చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అతనిపై కాల్పులు జరిపినట్లు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేసినట్లు వెల్లిడించారు.

ఇదీ చదవండి:ఆస్పత్రిలో కరోనా రోగి మృతి- వైద్యుడిపై బంధువుల దాడి