ETV Bharat / bharat

ఐఐటీ వాళ్లకే అద్దెకు ఇల్లు.. లింక్​డ్​ఇన్​ ప్రొఫైల్​, సాలరీ స్లిప్స్ మస్ట్.. హౌస్ ఓనర్ల వింత రూల్స్

మెట్రో నగరాల్లో ఇల్లు అద్దెకు లభించడం అంటే గగనమే అని చెప్పాలి. ఇంటి కోసం ఎన్నో రోజులు కష్టపడి తిరిగితే తప్ప దొరకదు. ఇప్పటికే ఇల్లు అద్దెకు దొరకడం కష్టంగా ఉన్న సమయంలో యజమానుల పెట్టే కొత్త నిబంధనలతో అది మరింత అసాధ్యంగా మారిపోయింది. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ చేసిన పోస్ట్​ ఇప్పడు వైరల్​గా మారింది.

renting in Bengaluru
renting in Bengaluru
author img

By

Published : Nov 27, 2022, 3:58 PM IST

సాధారణంగా అద్దె కోసం వెళ్లిన వారిని.. ఎంత మంది ఉంటారు, ఏం చేస్తారు వంటి విషయాలు అడిగి నచ్చితే ఇల్లు అద్దెకు ఇస్తారు. కానీ బెంగళూరుకు చెందిన యజమానులు మాత్రం కొత్తకొత్త నిబంధనలు పెడుతున్నారు. అద్దెకు ఉండే వ్యక్తి ఫలానా కళాశాలలో మాత్రమే చదివితేనే ఇల్లు అద్దెకు ఇస్తామని చెబుతున్నారు. సాలరీ స్లిప్స్ ఇవ్వాలని కొందరు.. లింక్​డ్​ఇన్​ ఖాతా వివరాలు ఇవ్వాలని మరికొందరు యజమానులు అడుగుతున్నారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాతే ఇల్లు అద్దెకు ఇస్తామంటున్నారు. బెంగళూరులో అద్దె ఇంటి కోసం తిరిగిన ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్​గా మారింది.

ప్రియాంశ్​ జైన్​ అనే వ్యక్తి తన వ్యక్తిగత వివరాలు చెప్పి అద్దెకు ఇల్లు కావాలని ఓ బ్రోకర్​ను సంప్రదించాడు. స్పందించిన బ్రోకర్​ ఏ కళాశాలలో చదువుతావని ప్రశ్నించగా.. వెల్లూర్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత కొంతసేపటికే 'నీ ప్రొఫైల్​ మ్యాచ్ కావడం లేదు' అంటూ తిరస్కరించారు. ఐఐటీ, ఐఐఎం, సీఏ, ఐఎస్​బీ విద్యార్థులకు మాత్రమే అద్దెకు ఇస్తామని తేగేసి చెప్పారు.

జైన్​ ఈ విషయాన్ని ట్విట్టర్​ పోస్ట్ చేయగా.. కొద్దిసేపటికే అనేక మంది ప్రొఫెషనల్స్ బెంగళూరు ఇంటి యజమానులతో వారికున్న అనుభవాలను పంచుకున్నారు. తాను బెంగళూరుకు మారుతున్నానని.. ఇంటి కోసం వెతకగా.. ఓ యజమాని తన లింక్​డ్​ఇన్​ ప్రొఫైల్​ వివరాలు అడిగాడని చెప్పాడు ఆర్నావ్​ గుప్తా అనే ఇంజినీర్. తన సాలరీ స్లిప్స్​ కావాలని కోరినట్లు తెలిపాడు మరో వ్యక్తి. మరికొందరు మీకు గర్ల్​ఫ్రెండ్ ఉందా అని అడిగారని పేర్కొన్నాడు. ఇల్లు అద్దెకు ఇవ్వడానికి 'మీ పేరు షార్ట్​లిస్ట్ కాలేద'ని మెసేజ్​ వచ్చిందని మరికొందరు వాపోయారు.

ట్వీట్​
renting in Bengaluru
ట్వీట్​
renting in Bengaluru
ట్వీట్​

ఇవీ చదవండి: టీచర్​ను ఈవ్ టీజింగ్ చేసిన విద్యార్థులు.. క్లాస్​కు వెళ్తుంటే ఇష్టమొచ్చినట్టుగా...

అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం సందర్శనకు సామాన్యులకూ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.