ETV Bharat / bharat

ప్రశాంతంగా ముగిసిన బంగాల్​ తుది విడత పోలింగ్​ - బంగాల్​ ఎనిమిదోదశ తాజా సమాచారం

A total of 283 contesting candidates including 35 female candidates from 35 constituencies in 4 districts of Bengal are trying their luck in the eighth phase of the polls scheduled to be held on Thursday.

Bengal eight phase elections live updates
బంగాల్​ ఎనిమిదోదశ పోలింగ్
author img

By

Published : Apr 29, 2021, 7:05 AM IST

Updated : Apr 29, 2021, 6:39 PM IST

18:35 April 29

ప్రశాంతంగా తుది విడత పోలింగ్​..

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. భారీ భద్రతతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టింది ఈసీ. సాయంత్రం 5 గంటల వరకు 76 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 

ఎనిమిదో విడతలో మొత్తం.. 35 నియోజకవర్గాలకు పోలింగ్​ జరిగింది. 283 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. మే 2న తుది ఫలితాలు వెలుడవనున్నాయి. 

15:40 April 29

3 గంటల వరకు 68 శాతం పోలింగ్​..

బంగాల్​ తుది విడత పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 68.46 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 

11:37 April 29

37 శాతం పోలింగ్​

కరోనా వేళ జరుగుతున్న బంగాల్​ చివర దశ ఎన్నికల్లో 11.30 గంటల వరకు 37.80 శాతం ఓటింగ్​ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతుంది. 

11:14 April 29

ఓటు వేసిన రాష్ట్ర గవర్నర్​

బంగాల్​ చివరి విడత ఎన్నికల్లో రాష్ట్ర గవర్నర్​ జగ్​దీప్ ధన్​కర్.. ఆయన సతీమణి సుదేశ్​ ధన్​కర్​ ఓటు వేశారు. కోల్​కతాలోని చోరంగీ పోలింగ్​ బూత్​లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

09:39 April 29

ఉదయం 9.30 వరకు 16 శాతం ఓటింగ్​...

బంగాల్​ చివరి విడత ఎన్నికల్లో ఉదయం 9.31 గంటల వరకు 16 శాతానికిపైగా పోలింగ్​ జరిగింది. 

09:19 April 29

  • West Bengal: A bomb was hurled near Mahajati Sadan Auditorium in north Kolkata today. Election Commission has sought details of the incident. Details awaited. pic.twitter.com/hbhikPorZo

    — ANI (@ANI) April 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాంబు కలకలం

బంగాల్ చివరి దశ ఎన్నికల్లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఉత్తర కోల్​కతాలోని మహాజాతి సదన్​ ఆడిటోరియానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.

08:50 April 29

'కరోనా నిబంధనలు పాటించండి'

బంగాల్​ చివరి దశలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఓటింగ్​లో పాల్గొనాలని ఓటర్లకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్వీట్​ చేశారు.

07:52 April 29

ఆలస్యంగా ఓటింగ్​..

బీర్భుమ్​లోని 188వ పోలింగ్​ బూత్​లోని ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా కాస్త ఆలస్యంగా ఓటింగ్​ ప్రారంభమైంది.

07:42 April 29

  • Actor and BJP leader Mithun Chakraborty cast his vote for the final phase of #WestBengalPolls, at a polling station in Kashipur-Belgachia, North Kolkata

    He says, "I had never voted so peacefully ever before. I must congratulate all the security personnel." pic.twitter.com/3nXS3UvkDI

ఓటేసిన మిథున్​ చక్రవర్తి..

బంగాల్​ చివరి విడత ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ప్రముఖ నటుడు, భాజపా నేత మిథున్​ చక్రవర్తి.. కాశిపుర్​-బెల్గాచియా పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంత శాంతియుత వాతావరణంలో ఇంతకుముందెన్నడూ ఓటేయలేదని వ్యాఖ్యానించారు. 

06:34 April 29

బంగాల్ దంగల్​: చివరిదశ పోలింగ్​ షురూ

బంగాల్​లో చివరిదైన ఎనిమిదో విడత పోలింగ్​ ప్రారంభమైంది. మాల్దా, శాంతినికేతన్​, బోల్​పుర్​ పోలింగ్ బూత్​ల​ వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

35 నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 283 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ దఫా మొత్తం 84 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు.

పటిష్ఠ భద్రత నడుమ పోలింగ్​

గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం సున్నితమైన ప్రాంతంగా గుర్తించిన బీర్భుమ్‌ జిల్లాలో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.

మే2న బంగాల్​తో పాటు, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. 

Last Updated : Apr 29, 2021, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.