ETV Bharat / bharat

ట్విట్టర్​లో గవర్నర్​ను బ్లాక్ చేసిన సీఎం.. కారణమిదే.. - ట్విట్టర్​లో గవర్నర్​ను బ్లాక్ చేసిన సీఎం

Bengal CM Mamata Banerjee: బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్​ ధన్​కర్​ను​ ట్విట్టర్​లో బ్లాక్ చేశారు. ఆయన ట్వీట్లతో మనస్తాపం చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ధన్​కర్​ బెదిరిస్తున్నారని మమత తీవ్ర ఆరోపణలు చేశారు.

Bengal CM Mamata Banerjee blocked Governor Jagdeep Dhankhar in twiter
ట్విట్టర్​లో గవర్నర్​ను బ్లాక్ చేసిన సీఎం
author img

By

Published : Jan 31, 2022, 5:12 PM IST

Updated : Jan 31, 2022, 5:24 PM IST

Mamata blocked Jagdeep Dhankhar: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్​​ జగదీప్ ధనకర్​ మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. తాజాగా ట్విట్టర్​లో ఆమె ధనకర్​ను బ్లాక్​ చేశారు. ఆయన తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ చేసే ట్వీట్ల వల్ల మనస్తాపం చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీని గవర్నర్ బెదిరిస్తున్నారని కోల్​కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు మమత.

ధన్​కర్​ను బంగాల్ గవర్నర్​గా తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని మమత తెలిపారు. చర్యలు తీసుకునే సూచనలే కన్పించడం లేదన్నారు.

మమతకు, ధన్​కర్​కు తొలి నుంచి పడటం లేదు. ఇద్దరూ తరచూ బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటారు.

గవర్నర్​ను తొలగించాలని కోరా..

బంగాల్ గవర్నర్ ధన్​కర్​ను తొలగించాలని బడ్జెట్ సమావేశాల తొలిరోజున రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు విజ్ఞప్తి చేశానని చెప్పారు టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్​. ఆ సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పక్కనే ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: భాజపా వ్యూహం- అఖిలేశ్​పై బరిలోకి కేంద్రమంత్రి

Last Updated : Jan 31, 2022, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.