'ఆమె' (ముఖ్యమంత్రి మమతా బెనర్జీ) తన కాలికైన గాయం ఇంకా బాగా కనిపించేలా బెర్ముడాలు (పొట్టి ప్యాంట్లు) ధరించాలి అంటూ బంగాల్ భాజపా అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన సూచన తాలూకు వీడియో పెనుదుమారం రేపుతోంది.
'అసహ్యకరమైన వ్యాఖ్యలు' అంటూ టీఎంసీ నేతలు మండిపడుతుండగా, సామాజిక మాధ్యమాల్లోనూ పలువురు మహిళలు అసహనం వ్యక్తంచేశారు. వాస్తవానికి ఎవరి పేరు ప్రస్తావించకుండా ఘోష్ ఈ వ్యాఖ్యలు చేసినా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే ఈ వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-
@BJP WB Pres asks in public meeting why Mamatadi is wearing a saree, she should be wearing “Bermuda” shorts to display her leg better
— Mahua Moitra (@MahuaMoitra) March 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
And these perverted depraved monkeys think they are going to win Bengal?
">@BJP WB Pres asks in public meeting why Mamatadi is wearing a saree, she should be wearing “Bermuda” shorts to display her leg better
— Mahua Moitra (@MahuaMoitra) March 24, 2021
And these perverted depraved monkeys think they are going to win Bengal?@BJP WB Pres asks in public meeting why Mamatadi is wearing a saree, she should be wearing “Bermuda” shorts to display her leg better
— Mahua Moitra (@MahuaMoitra) March 24, 2021
And these perverted depraved monkeys think they are going to win Bengal?
గత సోమవారం పురులియా ఎన్నికల సభలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. 'ఆమె చీర ధరించడంతో కాలి గాయం సరిగా కనిపించడం లేదు. గాయపడ్డ కాలు ప్రజలకు చూపించాలని అనుకుంటే బెర్ముడాలు ధరిస్తే మేలు. కాలు స్పష్టంగా కనిపిస్తుంది' అంటూ చేసిన వ్యాఖ్యలు వీడియోలో రికార్డయ్యాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ నేతలు 'దిలీప్ ఘోష్ లాంటి వారు మాత్రమే ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయగలరు. ఓ మహిళా సీఎం గురించి ఆయన చేసిన ఈ బాధాకరమైన వ్యాఖ్యలు బంగాల్ భాజపా నేతలకు మహిళలను గౌరవించడం తెలియదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి' అంటూ బెంగాలీలో ట్వీట్లు చేశారు.
ఇవీ చూడండి: 'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?