BEL Engineer Recruitment 2023 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హత ఏంటి? దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ ఎప్పుడు? ఫీజు ఎంత? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
బెల్(చెన్నై) ఇంజినీర్ జాబ్స్..
BEL Engineer Posts Vacancy : నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ 'బెల్' మొత్తం మూడు విభాగాల్లో 23 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది.
పోస్టుల వివరాలు..
- ప్రాజెక్ట్ మేనేజర్ (ఎలక్ట్రానిక్స్)- 12
- ప్రాజెక్ట్ ఇంజినీర్(మెకానికల్)-6
- ప్రాజెక్ట్ ఇంజినీర్( కంప్యూటర్ సైన్స్)-2
- ప్రాజెక్ట్ ఇంజినీర్(హెచ్ఆర్)-1
- ట్రైనీ ఇంజినీర్(కంప్యూటర్ సైన్స్)-2
విద్యార్హతలు
BEL Engineer Posts Qualification : బెల్ విడుదలైన పోస్టులకు అప్లై చేసుకునేందుకు బీఈ/బీటెక్/ బీఎస్ఈ ఇంజనీరింగ్/ ఎంబీఏ(హెచ్ఆర్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు ఆయా పోస్టులకు అనుగుణంగా రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి..
BEL Engineer Posts Age Limit : 2023 జులై 1 నాటికి ప్రాజెక్ట్ ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు, అలాగే ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి విధించారు. ఓబీసీలకు అదనంగా 3 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు వయసు సడలింపు అవకాశం కల్పించారు.
ఎంపిక విధానం
BEL Engineer Posts Process : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ
BEL Engineer Posts Apply Last Date : ఆసక్తి గల అభ్యర్థులు 2023 ఆగస్టు 9లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.472 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేసే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.177 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
జీతభత్యాలు..
BEL Trainee Engineer Salary : ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000-55,000 జీతం ఇస్తారు. అలాగే ట్రైనీ ఇంజినీరింగ్ పోస్టులకు ఎంపికైనవారికి రూ.30,000-40,000 ఇస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెల్(చెన్నై)లో పనిచేయాల్సి ఉంటుంది.