కరోనా వైరస్ రెండో ఉద్ధృతి నుంచి ఊపిరి పీల్చుకుంటుండగానే నిఫా వైరస్ రూపంలో మరో ఉపద్రవం వచ్చిపడేలా ఉంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గుహలో నిఫా వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ వివరాలు బయటపెట్టింది.
మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గుహలో వ్యాధి సోకిన గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షించగా.. వాటిల్లో నిఫా వైరస్ వ్యాపించినట్లు తేలింది. రాష్ట్రంలో ఇంతకుమునుపెన్నడూ ఈ వైరస్‌ను గుర్తించలేదని పరిశోధన బృందం నాయకురాలు డా. ప్రాద్య్న యాదవ్ తెలిపారు.
కరోనా వైరస్ కన్నా నిఫా వైరస్ ఎంతో ప్రమాదకరమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ప్రమాదకర వైరస్ల జాబితాలో మొదటి పది స్థానాల్లో ఇది ఉంది. మొదటిసారిగా మలేషియాలో 1998-99లో పందుల్లో దీనిని గుర్తించారు. ఈ వైరస్‌కు టీకా కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తే ప్రాణ నష్టం అపారంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అప్పుడే గరిష్ఠస్థాయికి మూడోదశ- రాష్ట్రాలు సన్నద్ధం!
Coronavirus Live Updates: 42 వేల కొత్త కేసులు.. 1100 మరణాలు