ETV Bharat / bharat

చారిత్రక పంబన్​ వంతెనకు తప్పిన ముప్పు

వందేళ్ల చరిత్ర కలిగిన పంబన్​ బ్రిడ్జిని ఢీకొడుతూ వెళ్లింది ఓ భారీ నౌక. గాలివీచే దిశలో ఆకస్మిక మార్పుల కారణంగా ఈ ఘటన జరిగింది.

Barge rams Pamban bridge
పంబన్ వంతెన
author img

By

Published : Jul 25, 2021, 8:01 PM IST

Updated : Jul 25, 2021, 9:46 PM IST

పంబన్ వంతెన పిల్లర్​ను తాకూతూ వెళ్లిన నౌక

తమిళనాడులోని చారిత్రక పంబన్ వంతెనకు తృటిలో ప్రమాదం తప్పింది. రామేశ్వరంలో ఉన్న ఈ బ్రిడ్జిని ఓ బార్జ్​ (పెద్ద నౌక) ఢీ కొడుతూ వెళ్లింది. శనివారం మధ్యాహ్నం దక్షిణం నుంచి ఉత్తరం వైపు మరో రెండు టగ్​ బోట్లతో కలిసి వెళ్తున్న ఈ నౌక.. గాలి వీచే దిశలో ఆకస్మిక మార్పుల వల్ల వంతెనను తాకుతూ వెళ్లింది.

Barge rams Pamban bridge
వంతెనను ఢీ కొడుతూ వెళ్తున్న నౌక

అయితే ఈ ఘటనలో వంతెనకు ఎలాంటి నష్టం జరగలేదని ఓ అధికారి తెలిపారు. బ్రిడ్జి దాటిన తర్వాత మరో కంట్రీ బోటును కూడా ఢీకొట్టింది ఈ బార్జ్. దీంతో స్థానిక మత్స్యకారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 2013లోనూ ఓ నేవీ బార్జ్​.. వంతెనను తాకుతూ వెళ్లడం వల్ల నిర్మాణానికి భారీగా నష్టం జరగడమే అందుకు కారణం.

Barge rams Pamban bridge
బోటును గుద్దుతున్న నౌక

వందేళ్ల ఘన చరిత్ర..

దేశంలోనే సముద్రంపై నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే. 1914 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ వంతెన రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతుంది. 1988లో రోడ్డు బ్రిడ్జి నిర్మించేంతవరకు రామేశ్వరానికి ఇదే ఏకైక మార్గం.

ఇదీ చూడండి: వంతెన పైనుంచి నదిలో పడ్డ లారీ- ఆరుగురు మృతి

Last Updated : Jul 25, 2021, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.