ETV Bharat / bharat

''పెళ్లికి వెళ్లి బాగా తింటా.. కడుపు నొప్పి వస్తుంది'..​ లీవ్ ఇవ్వండి సారూ!'

బిహార్​లో కొందరు ఉపాధ్యాయులు రాసిన లీవ్ లెటర్​లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తన తల్లి చనిపోతుందని.. అంత్యక్రియల కోసం ముందుగానే ఓ టీచర్​.. ప్రిన్సిపల్​కు లెటర్ రాశారు. ఇంకొన్ని లెటర్​లలో ఉపాధ్యాయులు ఏమని రాశారంటే?

Banka Teacher Strange Leave Application
Banka Teacher Strange Leave Application
author img

By

Published : Dec 2, 2022, 9:01 PM IST

బిహార్​లో కొందరు ఉపాధ్యాయులు​ రాసిన లీవ్​ లెటర్​లు​ సోషల్​మీడియాలో హల్​చల్​ చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఇలా కూడా లీవ్​ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా అంటూ ఆశ్చర్యపడుతున్నారు.
బాంకా జిల్లాలోని కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు లీవ్​ కోసం తాను పనిచేస్తున్న.. స్కూల్​ ప్రిన్సిపల్​కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. 'ప్రిన్సిపల్ సార్.. మా అమ్మ డిసెంబరు 5వ తేదీ రాత్రి 8 గంటలకు చనిపోతారు. అందుకే ఆమె అంత్యక్రియల కోసం.. డిసెంబర్ 6,7న సెలవు కావాలి. దయచేసి సెలవు ఇవ్వండి' అని కోరారు.

banka teacher strange leave application
అజయ్ కుమార్ రాసిన లీవ్​ లెటర్​

నాకు ఆరోగ్యం బాలేదు..
బరాహత్‌లోని ఖాదియారా ఉర్దూ విద్యాలయ ఉపాధ్యాయుడు రాజ్​గౌరవ్ రాసిన మరో లేఖ వైరల్ అవుతోంది. 'నాలుగు రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగోదు.. అందుకే ముందుగానే సెలవు కావాలి. డిసెంబర్​ 4,5 తేదీల్లో నాకు సెలవు ఇవ్వండి' అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడుకి లేఖ రాశారు.

banka teacher strange leave application
రాజ్ గౌరవ్ రాసిన లీవ్​ లెటర్​

పెళ్లికి వెళ్తా..
కటోరియాకు చెందిన నీరజ్‌ కుమార్‌ అనే ఉపాధ్యాయుడు క్యాజువల్‌ లీవ్‌ కోసం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను దరఖాస్తు చేసుకున్నారు. ' నేను పెళ్లికి వెళ్లాలి.. అక్కడ భోజనం బాగా చేస్తాను. అప్పుడు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకు డిసెంబరు 7న లీవ్ మంజూరు చేయండి.' అని కోరాడు.

banka teacher strange leave application
నీరజ్​ కుమార్​ రాసిన లీవ్​ లెటర్​

ఇలాంటి వింత లీవ్​ లెటర్​లు రావడానికి భాగల్​పుర్ కమిషనర్​ దయానిధన్ పాండే చేసిన ఉత్తర్వులే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే కమిషనర్​​ పాఠశాలలను తనిఖీ చేసిన సమయంలో.. ఒకే పాఠశాలలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వడం వలన విద్యాబోధనపై ప్రభావం పడినట్లు ఆయన గుర్తించారు. దీంతో ఉపాధ్యాయులు సెలవులు తీసుకునే ముందు.. తప్పని సరిగా లీవ్​ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నవంబర్​ 29న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయులు రకరకాలుగా దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.

banka teacher strange leave application
కమిషనర్ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.