ETV Bharat / bharat

బ్యాంక్​ దోపిడీకి మాజీ ఉద్యోగి యత్నం- మేనేజర్​ను చంపి..

ఓ బ్యాంకు మాజీ మేనేజర్​.. తాను పనిచేసిన బ్యాంకులోనే దోపిడీకి యత్నించాడు. అడ్డుకున్న ప్రస్తుత మేనేజర్​ను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Bank robbery
బ్యాంకులో చోరీ
author img

By

Published : Jul 30, 2021, 2:37 PM IST

తాను పనిచేసిన బ్యాంకులోనే దోపిడీకి యత్నించి, ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు ఓ మాజీ మేనేజర్​. ఈ ఘటన మహారాష్ట్ర, పాల్​ఘడ్​​ జిల్లాలోని విరార్ ప్రాంతంలో జరిగింది.

పథకం ప్రకారం..

విరార్​(ఈస్ట్) బ్రాంచ్ ఐసీఐసీఐ బ్యాంకులో గతంలో మేనేజర్​గా పనిచేశాడు అనిల్​ దూబే. బ్యాంకు మూసివేత సమయం, ఉద్యోగులు లేని సమయాలు తెలుసు కాబట్టి.. మరొకరితో కలిసి గురువారం రాత్రి 8 గంటల సమయంలో దోపిడీకి యత్నించాడు. అడ్డుకున్న మేనేజర్ యోగితా వర్తక్​ను కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. ఈ ఘటనలో క్యాషియర్ శ్వేతా దేశ్​ముఖ్​ సైతం తీవ్రంగా గాయపడ్డారు.

ఇద్దరిపై దాడి చేసి పారిపోతున్న అనిల్​ దూబేను స్థానికులు అతి కష్టం మీద పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: 20 నిమిషాల్లో 17 కిలోల బంగారం చోరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.