ETV Bharat / bharat

DAV School Incident: LKG చిన్నారిపై లైంగిక దాడి ఘటన.. డ్రైవర్​కు 20 ఏళ్ల జైలు శిక్ష

DAV School Incident
DAV School Incident
author img

By

Published : Apr 18, 2023, 12:20 PM IST

Updated : Apr 18, 2023, 1:43 PM IST

12:17 April 18

DAV స్కూల్ చిన్నారిపై లైంగిక దాడి.. డ్రైవర్​కు 20 ఏళ్ల జైలు శిక్ష

DAV School Driver sentenced to 20 years in Rape case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ పాఠశాలలో చిన్నారిపై లైంగికదాడి కేసులో దోషి రజనీకుమార్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో డ్రైవర్‌ రజనీకుమార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

DAV School incident Judgement : గతేడాది అక్టోబర్ 17న బంజారాహిల్స్ డీఏవీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్‌పై కేసు నమోదైంది. అక్టోబర్ 19న రజనీకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కారు డ్రైవర్‌ను తరగతి గదిలోకి అనుమతించడంపై ప్రిన్సిపల్ మాధవిపైనా కేసు నమోదు చేశారు. అయితే కోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది. రజనీకుమార్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

అసలేం జరిగిందంటే: బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో ఓ ఐదేళ్ల చిన్నారి ఎల్‌కేజీ చదువుతోంది. ఎప్పుడూ హుషారుగా ఉండే ఆ చిన్నారి.. కొన్ని రోజులుగా నీరసంగా ఉంటుండటంతో తల్లి ఆరా తీసింది. పాఠశాల ప్రిన్సిపల్‌ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి తన గారాల పట్టిపై లైంగిక దాడికి పాల్పడినట్లు, రెండు నెలలుగా ఇదే తరహాలో ఇబ్బంది పెడుతున్నట్లు తెలుసుకుంది. వెంటనే విషయాన్ని భర్తకు చెప్పింది. వెంటనే తమ స్నేహితులు, బంధువులతో కలిసి పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు.. అక్కడే ఉన్న డ్రైవర్‌ను నిలదీశారు. అతడు బుకాయించడంతో చితకబాదారు. ఒక దశలో పాఠశాల ప్రిన్సిపల్‌పైనా దాడి చేసేందుకు వెళ్లగా.. సిబ్బంది సర్ది చెప్పడంతో శాంతించారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడకు చేరుకొని డ్రైవర్‌ రజనీకుమార్‌ సహా ప్రిన్సిపల్‌ను అరెస్టు చేశారు.

ఈ క్రమంలోనే రజనీ కుమార్ నేర చరిత్ర గురించి పోలీసులు వివరాలు సేకరించారు. నిందితుడు మరికొంత మంది విద్యార్థినిలతోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు తేల్చారు. 11 ఏళ్లుగా పాఠశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్ వద్ద డ్రైవర్​గా పని చేస్తున్న రజనీ కుమార్.. ఇతర ఉపాధ్యాయుల వద్ద అజమాయిషీ ప్రదర్శించే వాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రిన్సిపల్ వద్ద ఉండే వ్యక్తి కావడంతో ఉపాధ్యాయులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరించారని పోలీసులు తెలిపారు. దీనిని ఆసరాగా తీసుకొని చిన్నారుల తరగతి గదుల్లోకి వెళ్లడం.. డిజిటల్ క్లాస్ రూమ్​లోకి తీసుకెళ్లడం లాంటివి చేసేవాడని.. ఈ క్రమంలోనే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

పాఠశాల గుర్తింపు రద్దు..: ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల గుర్తింపును రద్దు చేశారు. స్కూల్‌లో చదువుతున్న పిల్లలను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 700 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయొద్దని.. ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని విద్యా శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న విద్యా శాఖ అధికారులు.. ఈ విద్యా సంవత్సరం వరకు పాఠశాల గుర్తింపును కొనసాగించాలని నిర్ణయించింది.

ఇవీ చూడండి..

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. ప్రిన్సిపల్​ డ్రైవర్​ను చితక్కొట్టిన తల్లిదండ్రులు

బంజారాహిల్స్​లో చిన్నారిపై అత్యాచారం కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

Last Updated : Apr 18, 2023, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.