Banarasi Saree New Collection : ఎన్నో ఏళ్లుగా ప్రజల మన్ననలు పొందుతున్న బనారసీ చీరలు ఇప్పుడు సరికొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. ఎంతో ఆకర్షణీయంగా, సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపడుతూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఈ బనారసీ చీరల తయారీ పరిశ్రమలు కొన్ని సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్నాయని వ్యాపారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటి నుంచి మళ్లీ బనారసీ చీరలకు ప్రజాదరణ పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఈ చీరలకు డిమాండ్ ఎక్కువవ్వడం వల్ల కస్టమర్లకు అందించడం కష్టమవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మారుతున్న ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో బనారసీ చీరలపై కాశీ నగర రూపురేఖలను ముద్రిస్తున్నామని తెలిపారు.
"బనారసీ చీర మీద బనారస్ మందిరం, అస్సీ ఘాట్, గంగామాత మీద మన పూర్వీకులు వారి ఆనవాళ్లు కనిపిస్తాయి"
- రిజ్వాన్ అహ్మద్, వ్యాపారి
Banarasi Saree Latest Designs : కాశీలోని ఆలయాల దర్శనానికి వచ్చిన మహిళలు.. బనారసీ చీరలపై ఉన్న చిత్రాలను చూసి ఆశ్చర్యపోతున్నామని చెబుతున్నారు. కాశీ నగరాన్ని వివరించేలా ఉన్న చిత్రాలు తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు చెప్పారు. చీరలపై ఉన్న చిత్రాలను వ్యాపారులు చక్కగా వర్ణిస్తున్నారని.. డిజైన్లు మెచ్చి చీరలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నామంటున్నారు పలువురు మహిళలు.
"కాశీ శివుడి మహానగరం అని మనకు తెలుసు . అలాగే బనారస్ చాలా అందమైన ప్రదేశం అని వింటుంటాం. ఇక్కడ అందమైన బనారసీ చీరలు దొరుకుతాయి. ఈ రాణీ రంగు (పింక్ కలర్) చీర ఎంత అందంగా ఉందో మీరు చూడొచ్చు. దీనిపై మొత్తం కాశీ కనిపిస్తుంది, శివ మందిరఘాట్, అస్సీ ఘాట్, ఈ చీర మీద చిత్రించి ఉన్నాయి. అవి మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇదే ఈ చీరల ప్రత్యేకత"
-రూప్సీ, కస్టమర్
బనారసీ చీరలను పోలిన చీరలు తక్కువ ధరకే మార్కెట్లోకి వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాము కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ.. అసలైన బనారసీ చీరలనే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. దీంతో తాము సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు.
విదేశాలు మెచ్చిన సిరిసిల్ల చీరలు.. రాజన్న సిరిపట్టుగా నామకరణం..
ఔరా! అనిపిస్తున్న చేనేత వెండి చీర.. ధర ఎంతో తెలుసా?
Designs on sarees: అచ్చెరువొందెలా.. చీరలపై చిత్తరువులు
బెనారస్ చీరలా మెరిసిపోతున్న గ్రాండ్ కేక్ చూడడానికి ఎంత బాగుందో