ETV Bharat / bharat

వెదురుతో సాక్స్​ల తయారీ.. ధరిస్తే ఆరోగ్యానికి మంచిదట!

bamboo socks in kolhapur: వెదురు బొంగులలో బిర్యానీ తయారీ చూశాం. వివిధ రకాల ఇంటి వస్తువుల తయారీ చూశాం. కానీ వెదురు కర్రలతో సాక్స్​లను తయారు చేస్తున్నాడు నవీన్ కుమార్ మాలి. ఈయన మహారాష్ట్రలోని కొల్హాపుర్​కు చెందిన వ్యక్తి. బహుళ జాతి సంస్థలో ఉద్యోగాన్ని వదులుకుని మరీ ఈ సాక్స్​ల వ్యాపారం చేస్తున్నాడు.

Socks made from bamboo
వెదురు బొంగులతో తయారు చేసిన సాక్స్​లు
author img

By

Published : Apr 6, 2022, 4:51 PM IST

bamboo socks in kolhapur: ఇష్టమైన వ్యాపారాల కోసం పెద్ద పెద్ద ఉద్యోగాలను వదులుకుంటున్నారు చాలా మంది. అలాగే ఓ విభిన్న ఆలోచనతో ఉన్న నవీన్ కుమార్ మాలి.. వెదురు బొంగులతో సాక్స్​లు తయారుచేసే వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈయన మహారాష్ట్రలోని కొల్హాపుర్​కు చెందిన వ్యక్తి. అయితే కొన్నేళ్ల క్రితం పని మీద తైవాన్ వెళ్లాడు. ఆ సమయంలో వెదురుతో తయారుచేసిన సాక్స్​లను గమనించి.. వాటి గురించి అడిగి తెలుసుకున్నాడు. అప్పుడే నవీన్​కు తన స్వస్థలం కొల్లాపూర్​లో ఈ వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది.

Socks made from bamboo
వెదురు బొంగు సాక్స్​గా మారిన విధానం
Socks made from bamboo
వెదురు బొంగులతో తయారైన సాక్స్​లు

కొల్హాపుర్‌లోని ఇచల్‌కరంజిలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు నవీన్. ప్రయోగాత్మకంగా మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు బాగానే ఉందని అంటున్నాడు. అతడు ఈ సాక్స్‌లకు 'బాంబూ బీ ప్లస్' అని పేరు పెట్టాడు. వెదురును మొదట చూర్ణంగా మార్చి.. ఆ చూర్ణం నుంచి నూలు దారాన్ని తయారు చేస్తారు. ఆ దారాలను విభిన్న రంగులలోకి మార్చి సాక్స్​లను తయారుచేస్తారు. ఈ దారాల తయారీ కోసం తమిళనాడుకు చెందిన ఓ నిపుణుడిని నియమించుకున్నాడు నవీన్​ మాలి.

Socks made from bamboo
వెదురు బొంగులతో సాక్స్​ల తయారీ
Socks made from bamboo
వెదురు బొంగులతో తయారు చేసిన సాక్స్​లు

"ఇచ్చల్‌కరంజిలోని ఫ్యాక్టరీలో నేత పనులు ప్రారంభించాం. ఇందుకోసం తైవాన్ నుంచి అత్యాధునిక పరికరాలను తెప్పించాం. ఈ సాక్స్​ల తయారీకి పెద్దగా శ్రమ అవసరం లేదు. వెదురు బొంగులతో తయారుచేసిన సాక్స్​లకు ప్రస్తుతం మార్కెట్​లో విపరీతమైన డిమాండ్ ఉంది. వెదురు సాక్స్‌ల నాణ్యత ఇతర సాక్స్‌ల కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ సాక్స్‌లను నిత్యం ఉపయోగిస్తే పాదాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో వెదురు సాక్స్​లు చాలా బాగా పనిచేస్తాయి. ఈ సాక్స్​లు చర్మాన్ని పొడిగా, చల్లగా ఉంచుతాయి. ఇతర సాక్స్‌లతో పోలిస్తే ఇవి చాలా మృదువుగా ఉంటాయి. వీటిని వరుసగా 5 రోజులు ఉతకకుండా వేసుకున్నా ఎటువంటి దుర్వాసన రాదు. ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు.

మా సంస్థ వెబ్​సైట్, పుణె, కొల్హాపూర్​లో మాత్రమే ఈ సాక్స్​లు అందుబాటులో ఉంటాయి. అలాగే వ్యవసాయ ప్రదర్శనలతో పాటు ఎగ్జిబిషన్లు జరిగే చోట ఈ సాక్స్‌లను ప్రదర్శిస్తాం. మా నుంచి సాక్స్ కొనుగోలు చేసినవారు మళ్లీ మళ్లీ మా దగ్గరే కొంటున్నారు. ప్రస్తుతం సాక్స్​ల ధర రూ.200 నుంచి రూ.300 వరకు ఉంది. కాస్త ఎక్కువ ధరే అని చెప్పాలి. అయితే ప్రస్తుతం వ్యాపారం పెద్దగా జరగడం లేదు. వ్యాపారం బాగా జరిగితే.. ఈ సాక్స్‌ల ధరను తగ్గించగలను. "

- నవీన్ కుమార్​ మాలి, బాంబూ బీ ప్లస్ యజమాని

ఇదీ చదవండి: స్వీపర్​గా తల్లి పనిచేసే బడికి చీఫ్​ గెస్ట్​గా కుమారుడు.. ఎమ్మెల్యే హోదాలో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.