ETV Bharat / bharat

Balakrishna Interesting Comments : 'తెలంగాణలో టీడీపీ లేదన్న వారికి మేమేంటో చూపిస్తాం' - Balakrishna responsd Telangana elections

Balakrishna Interesting Comments : తెలంగాణలో టీడీపీ లేదన్న వారికి తామేంటో చూపిస్తామని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలుగుదేశం జెండా ఈ రాష్ట్రంలో రెపరెపలాడుతుందని బాలకృష్ణ పునురుద్ఘాటించారు.

tdp
Balakrishna
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 8:17 PM IST

Updated : Oct 4, 2023, 9:02 PM IST

Balakrishna Interesting Comments in Hyderabad : తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు.. ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్‌ జపం మొదలుపెట్టారని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్​ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ కార్యకర్తలతో బాలకృష్ణ (Balakrishna) భేటీ అయ్యారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని పట్టించుకోబోనని స్పష్టం చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్ స్పందించకపోయినా.. ఐ డోంట్ కేర్ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

TDP Protests in Hyderabad : చంద్రబాబు అక్రమ అరెస్ట్​కు నిరసనగా.. ఎన్టీఆర్​ ట్రస్ట్​ భవన్​లో దీక్ష

Balakrishna Respond to TTDP Contest in Telangana : ఆంధ్రప్రదేశ్​లో ఒక సైకో పరిపాలన నడుస్తోందని బాలకృష్ణ మండిపడ్డారు. ప్రజా సంక్షేమం గాలికి వదిలి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే రాజకీయం అక్కడ జరుగుతోందని విమర్శించారు. 17ఏ సెక్షన్‌ పాటించకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేశారు అనేదే తమ ప్రశ్న అని అన్నారు. ఈ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో తెలియదని.. అనవసరంగా ఎవరిపైనా తాము నిందలు వేయమని బాలకృష్ణ తెలిపారు.

కేంద్రం ప్రభుత్వం కల్పించుకోవాల్సిన అవసరం ఉన్న సమయంలో.. వారు మాట్లాడకపోవడం వారి విజ్ఞతకే వదిలేయాలని బాలకృష్ణ వెల్లడించారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై తప్పకుండా కేంద్రాన్ని కలుస్తానని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీ లేదన్న వారికి మేమేంటో చూపిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నట్లు బాలకృష్ణ వివరించారు.

Chandrababu Initiation in Rajamahendravaram Jail: 'సత్యమేవ జయతే' పేరిట జైలులో చంద్రబాబు.. బయట భువనేశ్వరి దీక్షలు

TTDP Contest in Telangana : తెలంగాణ (Telangana) ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన పరిణామాలు.. చంద్రబాబు హయాంలో చేసిన తెలంగాణ అభివృద్ధి కలిసి వస్తుందని బాలకృష్ణ వివరించారు. టీడీపీ జెండా ఈ రాష్ట్రంలో రెపరెపలాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో పొత్తుల గురించి చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పారు. పార్టీ పునర్‌వైభవానికి ప్రతి క్షణం పోరాడుతామని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని ఎన్టీఆర్ జపం మొదలు పెట్టినట్లు బాలకృష్ణ తెలిపారు.

Chandrababu Arrest : ప్రతిఒక్కరూ చంద్రబాబు (Chandrababu) అరెస్టుని ఖండిస్తున్నారని బాలకృష్ణ తెలిపారు. అయితే, తెలంగాణలో 3 రోజుల నుంచి ఖండిస్తున్నట్లు వివరించారు. కేవలం ఓట్ల కోసమే ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంతకాలం ఈ రాష్ట్రంలో టీడీపీ అజ్ఞాతంలో ఉందని.. ఇప్పుడు మళ్లీ చైతన్యం వస్తోందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా తెలుగు వారి గౌరవం కోసం పని చేద్దామని చెప్పారు. కేసులకు అరెస్టులకు భయపడమని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని అన్నారు. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని.. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉద్రిక్తత సృష్టిస్తున్నారని అనడం సరి కాదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

"బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నాం. చంద్రబాబు అరెస్టులో కేంద్రం హస్తం ఉందో లేదో తెలియదు. అనవసరంగా ఎవరిపైనా మేము నిందలు వేయం. చంద్రబాబు అరెస్టుపై తప్పకుండా కేంద్రాన్ని కలుస్తాను. సినిమా వాళ్లు స్పందించకపోయినా పట్టించుకోను. జూనియర్‌ ఎన్టీఆర్ స్పందించకపోయినా.. ఐ డోంట్ కేర్." - బాలకృష్ణ, ఎమ్మెల్యే

Balakrishna Interesting Comments తెలంగాణలో టీడీపీ లేదన్న వారికి మేమేంటో చూపిస్తాం

Minister Talasani React on Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్​ నన్నెంతో బాధించింది : తలసాని

TDP Leader Special Pooja for Chandrababu : చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ప్రత్యేక పూజలు..

Last Updated : Oct 4, 2023, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.