Baghpat news: ఉత్తర్‌ప్రదేశ్ బాగ్పత్ చాందీనగర్లోని కడి కలజారీ గ్రామంలో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ నవజాత శిశువును కోతి ఎత్తుకెళ్లి నీళ్లున్న డ్రమ్ములో పడేసింది. దీంతో ఆ పసికందు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
monkey taken away newborn baby
ఏం జరగిందంటే..
రెండు నెలల చిన్నారి.. తల్లిదండ్రుల పేర్లు భవర్ సింగ్, కోమల్. శనివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రపోయారు. భవర్ సింగ్ మేడపై పడుకున్నాడు. కోమల్ తన బిడ్డతో పాటు అత్తామామలు ఇంట్లోనే నిద్రించారు. రాత్రి 11 గంటలకు భవర్ సింగ్‌కు మెలకువ వచ్చి కిందకు రాగా.. బిడ్డ కన్పించలేదు. దీంతో భార్య, తల్లిదండ్రులను నిద్రలేపి అడిగాడు. చిన్నారి కన్పించకపోయే సరికి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంటా బయటా మొత్తం వెతికారు. అయినా కన్పించలేదు. దీంతో చట్టుపక్కల వారు సహా ఊళ్లో వారందంరికీ బిడ్డ అదృశ్యమైనట్లు చెప్పారు. ఊరంతా వెతికినా చిన్నారి జాడ తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చారు. పొరుగింట్లో ఉన్న సీసీటీవీ రికార్డును పరిశీలించారు. ఓ కోతి భవర్ సింగ్ ఇంటినుంచి బయటకు వెళ్లిన దృశ్యాలు కన్పించాయి. అదే చిన్నారిని ఎత్తికెళ్లినట్లు గ్రామస్థులు అనుమానించారు. మళ్లీ ఓసారి గ్రామమంతా జల్లెడ పట్టారు.
అయితే చివరకు ఇంట్లో ఉన్న నీటి డ్రమ్ములోనే శిశువు కన్పించాడు. వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో భవర్ సింగ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వీరిని చూసి గ్రామస్థులంతా చలించిపోయారు.
ఇంట్లోకి ప్రవేశించిన కోతే చిన్నారిని డ్రమ్ములో పడేసి ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: బావిలో పడ్డ పిల్ల ఏనుగు.. టెక్నిక్‌తో బయటకు..