Baby delivery at home Coimbatore: తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఓ మహిళ ఇంట్లోనే ప్రసవించింది. పురిటినొప్పులు వచ్చినా.. ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించిన మహిళ.. తన బిడ్డను పోగొట్టుకుంది.
Mother arrested for delivery at home
పున్నియావతి, విజయ్‌కుమార్ దంపతులు జిల్లాలోని ఉప్పుకార ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. మరోసారి గర్భం దాల్చింది పున్నియావతి. అయితే గర్భంపై పున్నియావతి సంతోషంగా లేదు. దీంతో బిడ్డను కనేందుకు అనాసక్తి ప్రదర్శించింది. అందుకే నొప్పులు వచ్చినా ఆస్పత్రికి వెళ్లకుండా ఉండిపోయింది. ఇంట్లోనే ప్రసవించేందుకు ప్రయత్నించి.. మృత శిశువుకు జన్మనిచ్చింది. బొడ్డుతాడు విచ్ఛేదనం సరిగా జరగకపోవడం వల్ల మగబిడ్డ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషయంపై సమాచారం అందుకున్న పెరియకడాయ్ పోలీసులు.. దంపతులను విచారించారు. అనంతరం పున్నియావతిని సెక్షన్ 315 కింద అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: