దిల్లీలోని సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) వినూత్నంగా ఆలోచించారు. కొండముచ్చుల కటౌట్లను సెంటర్లో ఉంచారు.
![Baboon cutouts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11830042_mlk.png)
గత కొద్ది రోజుల నుంచి సెంటర్లో కోతుల బెడద ఎక్కువయింది. పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బందిని బెదిరిస్తున్నాయి. వీటి ముప్పును తప్పించేందుకు కొండముచ్చుల కటౌట్లను సెంటర్ ప్రాంగణంలో ఉంచామని ఐటీబీపీ అధికార ప్రతినిధి వినయ్ పాండే తెలిపారు. కొండముచ్చుల బొమ్మలను చూసి కోతులు దూరంగా ఉంటున్నాయని వివరించారు.
![Baboon cutouts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11830042_img.png)
దిల్లీలోని ఈ కొవిడ్ సెంటర్.. 1700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పు ఉంటుంది. దేశంలోనే అత్యధికంగా 10,200 పడకల సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఆస్పత్రి బాధ్యతలను ఐటీబీపీ పర్యవేక్షిస్తోంది.
ఇదీ చదవండి: పెళ్లికి హాజరైన వారితో కప్పగంతులు