ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: సైమన్‌తో వచ్చి.. భారత్​కు సానుకూలమై - ఆజాదీ కా అమృత్​

భారత స్వాతంత్య్రోద్యమంలో ఆసేతు హిమాచలం వినిపించిన నినాదాల్లో ఒకటి సైమన్‌ గోబ్యాక్‌! ప్రత్యక్షంగా భారతావని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన ఈ కమిషనే పరోక్షంగా భారత స్వాతంత్య్రానికి ఓ సమర్థకుడినీ తయారు చేసింది.

Azadi-Ka-Amrit-Mahotsav
సైమన్‌తో వచ్చి.. సానుకూలమై
author img

By

Published : Feb 3, 2022, 8:34 AM IST

Azadi Ka Amrit Mahotsav: భారత్‌ పదేపదే కోరుతున్న స్వయం ప్రతిపత్తి ఇవ్వటం ఇష్టంలేని బ్రిటిష్‌ ప్రభుత్వం... పాలన సంస్కరణల పేరిట ఓ కమిషన్‌ను నియమించింది. అదే సైమన్‌ కమిషన్‌. ఇందులోని ఏడుగురూ బ్రిటన్‌ పార్లమెంటు సభ్యులే. భారత్‌లో సంస్కరణలంటూనే... ఒక్క భారతీయుడికీ ఇందులో సభ్యత్వం కల్పించలేదు. దీంతో జాతీయ కాంగ్రెస్‌తో పాటు ముస్లిం లీగ్‌ కూడా ఈ కమిషన్‌ను బహిష్కరించాయి. దేశవ్యాప్తంగా కమిషన్‌ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చాయి. గొడవలు జరిగే అవకాశం ఉందని తెలిసినా 1928 ఫిబ్రవరిలో జాన్‌ అల్సెబ్రూక్‌ సైమన్‌ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం ముంబయిలో అడుగు పెట్టింది. వీరిలో నలుగురు కన్జర్వేటివ్‌ పార్టీ, ఇద్దరు లేబర్‌ పార్టీ, ఒకరు లిబరల్‌ పార్టీ సభ్యులు. అధికారికంగా దీని పేరు 'ఇండియన్‌ స్టాట్యుటరీ కమిషన్‌'.

ఎక్కడికి వెళ్లినా నిరసనలే. ఎటు చూసినా నల్ల జెండాలే. సైమన్‌ ఎవరో తెలియకున్నా సైమన్‌ గోబ్యాక్‌ అనేది అందరి నోళ్లలో నానింది. యావత్‌ భారతం వ్యతిరేకించినా సైమన్‌ బృందం రెండు విడతలుగా భారత్‌లో పర్యటించింది. తొలుత 1928 ఫిబ్రవరి-మార్చిల్లో, తర్వాత అక్టోబరు 11 నుంచి 1929 ఏప్రిల్‌ 13 దాకా! 1919లో పాలనాపరమైన చట్టం తెచ్చినప్పుడే పదేళ్ల తర్వాత దాన్ని పునఃపరిశీలిస్తామన్నారు. ఆమేరకు 1928లో సైమన్‌ కమిషన్‌ను తెచ్చారు. 1930 మేలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి సైమన్‌ బృందం నివేదిక సమర్పించింది. భారత్‌లోని రాష్ట్ర స్థాయి ప్రభుత్వాల్లో ద్వంద్వ పాలన (కొన్ని శాఖలు ప్రజాప్రతినిధులు, మరికొన్ని బ్రిటిష్‌ అధికారుల చేతిలో ఉండటం)ను రద్దు చేసి... పూర్తిగా ప్రజాప్రతినిధులకే బాధ్యతలు అప్పగించాలని సిఫార్సు చేసింది. అయితే మతపరమైన ప్రత్యేక ఎలక్టొరేట్లను కొనసాగించాలంటూ హిందూ ముస్లింల మధ్య అంతరం మరింత పెరగటానికి ఈ కమిషన్‌ ఆజ్యం పోసింది. భారత్‌ స్వయం ప్రతిపత్తి డిమాండ్‌ను పూర్తిగా పక్కన పెట్టి... బర్మాను భారత్‌ నుంచి విడగొట్టి... స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని సిఫార్సు చేసింది. సైమన్‌ సిఫార్సులపై భారత్‌లో భారీస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో బ్రిటిష్‌ వైస్రాయ్‌ మళ్లీ స్వయంప్రతిపత్తి రాగం అందుకొని... లండన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం అంటూ అందరినీ సర్దిపుచ్చారు.

భారత రాజకీయ పార్టీలెంతగా వ్యతిరేకించినా... సైమన్‌ సిఫార్సుల ఆధారంగానే... 1935 చట్టం తీసుకొచ్చింది బ్రిటిష్‌ సర్కారు. ఈ చట్టమే స్వాతంత్య్రానంతరం... భారత రాజ్యాంగ రచనకూ చాలామటుకు ప్రాతిపదికైంది. సైమన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకే 1937లో ఎన్నికలు జరిగాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.

పైకి సైమన్‌ కమిషన్‌తో లాభం ఏమీ జరగనట్లు కన్పించినా... అదొక రకంగా మేలే చేసింది. ఈ బృందంలో సభ్యుడిగా వచ్చిన లేబర్‌ పార్టీ సభ్యుడు క్లెమెంట్‌ అట్లీ భారత్‌లో పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నారు. తమ ప్రభుత్వ పాలన భారతీయులనెంతగా బాధిస్తోందో... ఎంత అన్యాయంగా సాగుతోందో కళ్లారా చూశారు. భారతీయులు, స్వాతంత్య్రోద్యమం పట్ల సానుభూతి పెరిగిన అట్లీ... 1933 నుంచి భారత్‌ తరఫున బలంగా వాదించటం ఆరంభించారు. భారత్‌లో సామాజిక, ఆర్థిక సంస్కరణలు వచ్చి... దేశం పురోగతి సాధించాలంటే పాలనా పగ్గాలు స్వదేశీయులకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 1945లో తాను బ్రిటన్‌ ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టగానే... భారత్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం మొదలెట్టారు. వాటికి అంతర్జాతీయ పరిస్థితులు కూడా తోడవటంతో... అట్లీ పని మరింత సులువైంది. భారత స్వాతంత్య్రం అనుకున్నదానికంటే ముందే సాధ్యమైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 'ఇండియా ఒకటి కాదు రెండు- వాటి మధ్య అంతరాయం పెరుగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.