ETV Bharat / bharat

స్వయంప్రతిపత్తి ఇస్తామని చెప్పి.. షాకిచ్చిన బ్రిటిషర్లు

Rowlatt act in India: యుద్ధంలో గెలిచారు. మనసాయంతోనే నెగ్గారు. గెలిస్తే శుభవార్త చెబుతామని అంతకు ముందే మాటిచ్చారు. తీరా గెలిచాక తెప్ప తగలేయటమేగాదు... మన నోరు నొక్కేశారు. ఏంటని అడిగితే చాలు లోపల కుక్కేశారు. రష్యాలో విప్లవాన్ని చూసి భయపడి... రౌలత్‌ పేరుతో రాక్షస చట్టం తెచ్చి జాతీయోద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కేయజూశారు.

Azadi ka Amrit Mahostsav
ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్
author img

By

Published : Mar 18, 2022, 6:54 AM IST

Azadi ka Amrit Mahostsav: మొదటి ప్రపంచయుద్ధం కాగానే భారత్‌కు స్వయం ప్రతిపత్తినిస్తామంటూ హామీ ఇచ్చిన బ్రిటిష్‌ సర్కారు వేలమందిని సైన్యంలో భర్తీ చేసుకుంది. ఆంగ్లేయుల మాటలు నమ్మి గాంధీజీలాంటివారు సైతం ఉత్సాహంగా ఊరూరా తిరిగి యువకులను బ్రిటిష్‌ సైన్యంలో చేరేలా ప్రోత్సహించారు. మనదికాని యుద్ధంలో, మనకు తెలియని ప్రత్యర్థితో పోరాడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో బ్రిటన్‌ సహచర దేశాలు గెలిచాయి. ఇక ఇచ్చిన మాట మేరకు ‘స్వయం ప్రతిపత్తి’ శుభవార్త వస్తుందని అంతా ఆశగా ఎదురు చూస్తున్న వేళ... పిడుగులా వచ్చిందో వార్త! అదే రౌలత్‌ చట్టం. 1919 మార్చి 18న ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ - అరాచకవాదం, విప్లవ నేరాల చట్టాన్ని ఆమోదించింది. దీన్నే రౌలత్‌ చట్టంగా పిలుస్తారు.
భారత్‌లో రాజకీయ ఉగ్రవాదాన్ని అధ్యయనం చేయటానికి ఏర్పడిందీ రౌలత్‌ కమిటీ. 1917లో ఏర్పడ్డ ఈ కమిటీలో రౌలత్‌తో పాటు మరో ఐదుగురు సభ్యులు. 1910 తర్వాత బెంగాల్‌, పంజాబ్‌ల్లో విప్లవవాద సంస్థల కార్యకలాపాలు పెరిగాయి. పదేపదే బ్రిటన్‌ ప్రభుత్వం, అధికారులు లక్ష్యంగా దాడులు సాగాయి. వీటికి తోడుగా విదేశాల్లో ముఖ్యంగా జర్మనీ, రష్యా, అమెరికాల్లోనూ భారతీయ విప్లవకారుల సమావేశాలు జోరందుకున్నాయి. 1917లో రష్యాలో కమ్యూనిస్టులను అధికారంలోకి తెచ్చిన బోల్షివిక్‌ విప్లవంతో భారత్‌లో తమ సర్కారుకు ముప్పు రావొచ్చని ఆంగ్లేయులు భావించారు. వీరికి అదనంగా గాంధీ ఆధ్వర్యంలో జాతీయోద్యమం వేగం పుంజుకోవటం ఆరంభమైంది. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన రౌలత్‌ బృందం కఠినాతి కఠిన చర్యలను సిఫార్సు చేసింది. కొత్త చట్టాలను ప్రతిపాదించింది. వాటినే లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఆమోదించింది. ఈ రౌలత్‌చట్టం ప్రకారం బ్రిటిష్‌ సర్కారుకు అపారమైన విశేషాధికారాలు దఖలు పడ్డాయి.

Rowlatt act

రాజకీయ ఖైదీలను ఎలాంటి విచారణ లేకుండా రెండేళ్లపాటు నిర్బంధించటం; వారెంటు లేకుండా అరెస్టు చేయటం; ఎక్కడైనా తనిఖీలు చేయటం; రాజద్రోహ నేరం మోపి పత్రికల నోరు నొక్కటం, రాజకీయ సభలు, సమావేశాలపై నిషేధంలాంటివి కీలకం. అసలే భారతీయులను మనుషులుగా చూడని ఆంగ్లేయ సర్కారును ఈ రాక్షస చట్టం మరింత కర్కశంగా మార్చింది. ఆంగ్లేయులు విధించిన ఎమర్జెన్సీ ఇది. ఎవరెంతగా వ్యతిరేకించినా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. నలుగురికి మించి ఎక్కడ గుమికూడినా అరెస్టు చేసి లోపల వేసేశారు.

Rowlatt Law

స్వయంప్రతిపత్తి కాదుగదా... భారత్‌పై పట్టును కించిత్తైనా తగ్గించుకోవటానికి ఆంగ్లేయులు ఇష్టపడటం లేదనేది స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఈ చట్టంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. హర్తాళ్‌లు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో గాంధీజీ రౌలత్‌ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధానికి అనేకమంది యువకులను పంపించిన పంజాబ్‌ రగిలిపోయింది. అనేక చోట్ల హింస చెలరేగింది. ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మార్షల్‌లా విధించింది. దీంతో గాంధీ తన సత్యాగ్రహ పిలుపును ఉపసంహరించు కున్నారు. అయినా పంజాబీలు ఆగలేదు. ఏప్రిల్‌ 13 వైశాఖీరోజున జలియన్‌వాలాబాగ్‌లో సమావేశమయ్యారు. డయ్యర్‌ కాల్పుల్లో వందల మంది పిట్టల్లా రాలిపోవటం దేశంలోనే గాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
జాతీయోద్యమాన్ని ఉక్కు పిడికిలితో అణచివేయాలనుకుంటున్న ఆంగ్లేయుల ఆలోచనను పసిగట్టిన గాంధీజీ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా ఆగిపోతుందనుకున్న ఉద్యమం కొత్త రూపుదాల్చి ఊపందుకుంది. చివరకు 1922లో రౌలత్‌ రాక్షస చట్టాన్ని బ్రిటిష్‌ సర్కారు ఉపసంహరించుకుంది.

ఇదీ చదవండి: రూ.75 లక్షలకే కశ్మీర్​ను అమ్మేసిన ప్రభుత్వం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.