ETV Bharat / bharat

Ayodhya Tent City : ఘనంగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఏర్పాట్లు.. భక్తుల కోసం 'టెంట్​ సిటీ' నిర్మాణం - అయోధ్య టెంట్​ సిటీ

Ayodhya Tent City : అయోధ్య రామ మందిరం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్​ సిటీని నిర్మిస్తోంది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. జిల్లా యంత్రాంగం సహాయంతో భక్తులకు అన్నపానీయాలు కూడా అందించేందుకు సిద్ధమైంది.

Ayodhya Tent City
Ayodhya Tent City
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 11:04 AM IST

Updated : Aug 30, 2023, 8:03 AM IST

Ayodhya Tent City : 2024 జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం (Ayodhya Temple Opening), రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉన్న నేపథ్యంలో ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిరథమహారథుల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారితో పాటు సాధారణ భక్తులకూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. భక్తుల బస, అన్నపానీయాలకు సంబంధించిన ఏర్పాట్లపై రామ జన్మభూమి ట్రస్ట్​​.. జిల్లా యంత్రాంగంతో చర్చలు జరిపింది. అందులో భాగంగా దాదాపు 25 వేల మంది భక్తుల కోసం టెంట్​ సిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

Ayodhya Ram Mandir Opening Ceremony : అయోధ్య రాయాలయ ప్రారంభోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో వారు ఆయోధ్య వాసుల ఇళ్లలో, హోటళ్లలో పెయింగ్​ గెస్ట్​గా​ బస చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ధర్మశాలలు, ప్రైవేటు హోటళ్ల సామర్థ్యానికి మించి భక్తులు వస్తారని అంచనా. అలాంటి వారికి సహాయం చేసేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ సిద్ధమైంది. అయోధ్యలోని కరసేవక్​పురం కాంప్లెక్స్​, రామసేవక్​పురం కాంప్లెక్స్​ సహా నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో టెంట్​ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ విషయంపై శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ (Ayodhya Ram Mandir Trust) ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ మాట్లాడారు. 'టెంపుల్​ సిటీ ద్వారా దాదాపు 25 వేల మందికి బస ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి జిల్లా అధికారులు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. జిల్లా యంత్రాంగం సహాయంతో భక్తులకు ఆహార పదార్థాలు అందించడం, మురుగునీటి శుద్ధి, విద్యుత్ వ్యవస్థ తదితర ఏర్పాట్లు చేస్తున్నాం. అందుకు అవసరమయ్యే ఖర్చును ట్రస్ట్​ భరిస్తుంది. ఇక, ఆహార పదార్థాలను జిల్లా పౌర సరఫరా విభాగం సరఫరా చేస్తుంది. అయితే, వీటన్నింటి కోసం భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు' అని చంతప్​ రాయ్​ వివరించారు.

శరవేగంగా అయోధ్య మందిర నిర్మాణం.. ఆలయం లోపలి దృశ్యాలు చూశారా?

అయోధ్య రాముడికి జలాభిషేకం.. పాక్​, ఉక్రెయిన్​ సహా 155 దేశాల నీటితో..

Last Updated : Aug 30, 2023, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.