Ayodhya Ram Mandir Latest Update : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఆలయంలో అక్షత పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రారంభించారు ట్రస్టు సభ్యులు. ఈ అక్షతలను దేశవ్యాప్తంగా పంపిణీ చేసి ప్రజలను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 100 క్వింటాళ్ల బియ్యం, పసుపు, నెయ్యిని ఉపయోగించినట్లు ట్రస్ట్ తెలిపింది.
విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్కు చెందిన సుమారు 250 మంది కార్యకర్తలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లి వీటిని పంపిణీ చేయనున్నారు. దేశంలోని ప్రతి ఇంటికి అక్షతలను పంపిణీ చేసి ప్రాణ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానించనున్నారు. రామజన్మభూమి ప్రాంతంలోని ప్రధాన ద్వారం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం.. కార్యకర్తలకు అక్షత కలశాలను అందించారు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. ఇప్పటికే అయోధ్య నుంచి బయలుదేరిన కార్యకర్తలు.. గ్రామాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించి ప్రజలకు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.

"కార్యకర్తలందరూ డిసెంబర్ మూడో వారంలోగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుంటారు. అనంతరం స్థానికంగా ఉన్న ఆలయాల్లో అక్షత కలశాలకు పూజలు నిర్వహిస్తారు. తర్వాత ప్రతి ఇంటికి వెళ్లి అక్షతలను ఇచ్చి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తారు. జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఈ పంపిణీ ప్రక్రియ జరగనుంది."
--చంపత్ రాయ్, ట్రస్టు ప్రధాన కార్యదర్శి


గ్రౌండ్ ఫ్లోర్లో బాల 'రాముడు'- అయోధ్యలో శబరికి ప్రత్యేక ఆలయం, దర్శనానికి కోటి మంది భక్తులు!
Ayodhya Ram Mandir Specialities : అయోధ్యలో భవ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు సుదీర్ఘ సందేశాన్ని ఇచ్చింది. ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఆరోజు సాయంత్రం ఇళ్ల మందు దీపాలను వెలిగించాలని కోరింది. రామ మందిర నిర్మాణానికి సంబంధించిన పూర్తి విషయాలను షేర్ చేసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.