Ayodhya Ram Mandir Construction : ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం మొదటి ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుందని రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు.. చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. మూడంతస్తుల ఆలయ నిర్మాణంలో భాగంగా.. రాజస్థాన్‌లోని బన్సీ పహడ్పుర్ నుంచి తెచ్చిన రాతిని అమర్చే ప్రక్రియ సాగుతోంది. రామ మందిరంలో గర్భగుడితోపాటు గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం అనే ఐదు మండపాలు ఉంటాయి. ఈ ఐదు మండపాల గోపురాల పరిమాణం.. 34 అడుగుల వెడల్పు, 32అడుగుల ఎత్తులో ఉంటాయి. ఆలయం పొడవు 380అడుగులు, వెడల్పు 250 అడుగులు. గర్భగుడి మొత్తాన్ని మక్రానా పాలరాతి స్తంభాలతో నిర్మిస్తున్నారు. బరువు, వాతావరణపరంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకుని ఆలయం మొత్తంలో 392 స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం మొత్తం వైశాల్యం 8.64 ఎకరాలు. వచ్చే ఏడాది జనవరి కల్లా భక్తుల దర్శనార్థం రామ మందిరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ భావిస్తోంది.
-
The ground floor of the three-storied Shri Ram Temple in Ayodhya has entered its final construction phase. @HomeMinistr2024 @AmitShah had promised that the temple will be ready for opening by Jan 1, 2024.#RamMandir #Hindutva #goldenera #JaiShreeRam #Russia #ZEROBASEONE pic.twitter.com/iLGklV9OXO
— Samvad Gour (@SamvadG) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The ground floor of the three-storied Shri Ram Temple in Ayodhya has entered its final construction phase. @HomeMinistr2024 @AmitShah had promised that the temple will be ready for opening by Jan 1, 2024.#RamMandir #Hindutva #goldenera #JaiShreeRam #Russia #ZEROBASEONE pic.twitter.com/iLGklV9OXO
— Samvad Gour (@SamvadG) June 13, 2023The ground floor of the three-storied Shri Ram Temple in Ayodhya has entered its final construction phase. @HomeMinistr2024 @AmitShah had promised that the temple will be ready for opening by Jan 1, 2024.#RamMandir #Hindutva #goldenera #JaiShreeRam #Russia #ZEROBASEONE pic.twitter.com/iLGklV9OXO
— Samvad Gour (@SamvadG) June 13, 2023
-
wait is over
— Mahesh Bhavsar (@imaheshbhavsar) June 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Get ready for January 2024
Jai shree Ram 🙏 #Ayodhya pic.twitter.com/MkWLQ1parm
">wait is over
— Mahesh Bhavsar (@imaheshbhavsar) June 12, 2023
Get ready for January 2024
Jai shree Ram 🙏 #Ayodhya pic.twitter.com/MkWLQ1parmwait is over
— Mahesh Bhavsar (@imaheshbhavsar) June 12, 2023
Get ready for January 2024
Jai shree Ram 🙏 #Ayodhya pic.twitter.com/MkWLQ1parm
2019లో సుప్రీం తీర్పు:
Ram Mandir Foundation Stone : అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణానికి.. వేద మంత్రాల మధ్య పునాది రాయి వేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. మొత్తం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
రాముడి నుదుటిపై సూర్య కిరణాలు
మరోవైపు అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయానికి అదనపు హంగులు జోడిస్తున్నారు. ఆలయ గర్భగుడిలోని రాముడి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకేలా ఏర్పాట్లు చేపట్టారు. శాస్త్రీయంగా ఈ ప్రక్రియ జరిగేలా చూస్తున్నారు. ఇందుకోసం రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక నిర్మాణం చేపట్టనున్నారు. ఇది పూర్తైతే ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు.. రాముడి విగ్రహం నుదిటిపై పడతాయి.
ఇందుకోసం అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రాంగణంలో.. ప్యాసెంజర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విద్యుద్దీకరణ పనులు కొనసాగుతున్నాయి. అయితే, ఈ భవనం పైభాగంలో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా.. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నిర్మాణాలు చేయనున్నారు. ఓ పైప్‌ను అమర్చి.. ఆధునిక లెన్సుల ద్వారా సూర్య కిరణాలను ప్రసరింపజేయనున్నారు. రామ్‌లల్లా విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఈ ఏర్పాట్లు చేయనున్నారు.
ఇవీ చదవండి : అయోధ్య రాముడికి జలాభిషేకం.. పాక్, ఉక్రెయిన్ సహా 155 దేశాల నీటితో..
అయోధ్య రాముడికి సూర్యాభిషేకం.. విగ్రహం నుదుటిపై కిరణాలు పడేలా ఏర్పాట్లు