ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో అత్యాధునిక హంగులతో సిద్ధం అవుతోన్న విమానాశ్రయానికి రాముడి పేరు పెట్టనున్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత 'మర్యాద పురుషోత్తమ శ్రీరామ ఎయిర్పోర్ట్'గా నామకరణం చేయనున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. విమానాశ్రయ నిర్మాణ వ్యయానికి సంబంధించి రూ. 101 కోట్లను ఖర్చు చేయనున్నట్లు యోగి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రతిపాదనలను యూపీ ఆర్థికశాఖ మంత్రి సురేశ్ ఖన్నా అసెంబ్లీలో సోమవారం చదివి వినిపించారు.
అయోధ్య విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మార్చడంతో పాటు.. నోయిడాలోని జేవార్ విమానాశ్రయం నుంచి ఎయిర్‌స్ట్రిప్‌ల సంఖ్యను పెంచేందుకు మరో రూ.2,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అలీగఢ్, మోరాబాద్, మీరట్ ప్రాంతాల నుంచి త్వరలో సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అయోధ్య అభివృద్ధే ధ్యేయంగా ఉత్తర్‌ప్రదేశ్ బడ్జెట్!