ETV Bharat / bharat

స్కానింగ్​లో ఇద్దరు.. డెలివరీలో నలుగురు.. డాక్టర్లు షాక్​! - Four babies were born in one birth in uttar pradesh

ఓ ఆటోడ్రైవర్ భార్య ప్రసవం డాక్టర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. అల్ట్రాసౌండ్‌లో కవలలు ఉన్నట్లు తెలుసుకున్న డాక్టర్లు.. ఆపరేషన్​ సమయంలో కడుపులో నలుగురు శిశువులను గుర్తించడం గమనార్హం. ఈ నలుగురితో ఆటో డ్రైవర్​ సంతానం మొత్తం ఏడుకు చేరింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? సంతానంలో ఆడ, మగ పిల్లలు ఎంతమందంటే?

UP_AGR_Woman gave birth to 4 children in Agra, doctors showed charisma after several hours of operation
స్కానింగ్​లో ఇద్దరు.. డెలివరీలో నలుగురు.. డాక్టర్లు షాక్​.. పాపం ఆటోడ్రైవర్​
author img

By

Published : Jun 28, 2022, 12:28 PM IST

Updated : Jun 28, 2022, 10:38 PM IST

ఓ మహిళ ప్రసవం.. చాలా ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్లనే ఆశ్చర్యానికి గురి చేసింది. స్కానింగ్​కు సైతం అంతుపట్టని విధంగా ఆ మహిళ కడుపులో శిశువులు ఉండటం గమనార్హం. ఉత్తర్​ప్రదేశ్ ఆగ్రాలోని ఎత్మాద్దౌలా ప్రాంతంలోని ప్రకాష్ నగర్​కు చెందిన ఆటో డ్రైవర్ మనోజ్ భార్య ఖుష్బూ గర్భవతి. ప్రసవం కోసం ట్రాన్స్ యమునా కాలనీ ఫేజ్-1లోని అంబే ఆసుపత్రిలో చేర్చాడు. ప్రసవానికి ముందు ఖుష్బూకు డాక్టర్లు అల్ట్రాసౌండ్ చేశారు. అందులో కవలలు కనిపించారు. ఈ క్రమంలో మహిళకు శస్త్రచికిత్స చేస్తున్న క్రమంలో కడుపులో నలుగురు శిశువులు కనిపించారు. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్​ అయ్యారు. ఖుష్బూ జన్మనిచ్చిన నలుగురు పిల్లల్లో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

UP_AGR_Woman gave birth to 4 children in Agra, doctors showed charisma after several hours of operation
స్కానింగ్​లో ఇద్దరు.. డెలివరీలో నలుగురు

ఏడుకు చేరిన మొత్తం సంతానం
తాజాగా జన్మించిన నలుగురు పిల్లలతో ఆటో డ్రైవర్ మనోజ్‌ సంతానం మొత్తం ఏడుకు చేరడం గమనార్హం. అయితే మనోజ్​కు అంతకు ముందే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు మనోజ్​ ఆటో నడుపుతున్నాడు. ఒకేసారి నలుగురు పిల్లలు పుట్టారని కాస్త ఆందోళనకు గురయ్యారు. అయితే అందరూ క్షేమంగా ఉన్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేశాడు మనోజ్​.

ప్రస్తుతం నలుగురు శిశువులను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు వైద్యులు. ఈ ఆపరేషన్​పై ఆస్పత్రి వైద్యుడు మహేష్ చౌదరి స్పందించారు. 'చాలా సంవత్సరాలుగా ఆస్పత్రిని నిర్వహిస్తున్నా. అయితే ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూడలేదు. కుటుంబానికి అవసరం అయితే ఆర్థిక సాయం చేస్తా. మా తరఫున పూర్తి సహకారం అందిస్తాం. పిల్లల చదువులకు కూడా ఏర్పాట్లు చేస్తాం.' అని చెప్పారు మహేష్​.

ఇదీ చదవండి: నడిరోడ్డులో యువకుడిపై కాల్పులు.. పోలీస్​ సస్పెండ్​.. ఏం జరిగింది?

Last Updated : Jun 28, 2022, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.