ETV Bharat / bharat

పామును ముద్దాడబోయి ప్రాణాలు కోల్పోయిన సంరక్షకుడు - నాసిక్​లో స్నేక్​ క్యాచర్​ మృతి

పామును పట్టుకొచ్చిన ఓ స్నేక్​ క్యాచర్​.. దాన్ని ముద్దాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పాము అతడి పెదవిపై కాటు వేయడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాశిక్​లో జరిగింది.

snake catcher died in nashik
snake catcher died in nashik
author img

By

Published : Nov 15, 2022, 12:19 PM IST

మహారాష్ట్రలోని నాశిక్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పామును ముద్దాడేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. సిన్నర్​ తాలుకాలోని నాగేశ్​ భలేరో అనే ఓ స్నేక్​ క్యాచర్.. తాను పట్టిన ఓ పామును ముద్దాడేందుకు ప్రయత్నించగా పెదవిపై కాటు వేసింది.

వివరాల్లోకి వెళ్తే.. నాశిక్ సిన్నర్​కు చెందిన నాగేశ్​ అనే పాముల సంరక్షుడు శుక్రవారం ఓ పామును పట్టుకున్నాడు. అనంతరం ఆ పామును తీసుకుని తన స్నేహితుని కేఫ్​ వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆ పామును మేడపైకి తీసుకెళ్లి దానితో విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలోనే పామును ముద్దాడేందుకు ప్రయత్నించగా.. నాగేశ్​ పెదవిపై కాటు​ వేసింది. దీంతో అప్రమత్తమైన స్నేహితులు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మరణించాడు.

Attempting to kiss the snake Sarpamitra snake catcher lost his life
నాగేశ్​ భలేరో

ఇదీ చదవండి:మరణించిన వ్యక్తిని సర్పంచ్​గా గెలిపించిన గ్రామస్థులు.. మళ్లీ ఆయనకే ఓటేస్తామంటూ..

రోగికి పెట్టిన ఆహారంలో బొద్దింక.. దిల్లీ ఎయిమ్స్​లో ఘటన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.