ETV Bharat / bharat

TSPSC ప్రశ్నపత్రం లీకేజ్‌... అసిస్టెంట్ ఇంజినీర్స్‌ పరీక్ష రద్దు - ప్రశ్నపత్రం లీకేజ్‌ వల్ల పరీక్ష రద్దు

TSPSC Has Canceled Assistant Engineering Exam: ఈనెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్స్‌ పరీక్ష రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. మళ్లీ తొందరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా 837 పోస్టులకు 55వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌ కూడా స్పందించారు.

Assistant Engineers exam
Assistant Engineers exam
author img

By

Published : Mar 15, 2023, 9:40 PM IST

Updated : Mar 15, 2023, 10:53 PM IST

TSPSC Has Canceled Assistant Engineering Exam: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తూ.. మలుపులు తిరుగుతుంది. ప్రశ్నపత్రం లీకేజీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 5న జరిగిన ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మళ్లీ ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో అనేది తొందరలోనే వెల్లడిస్తామని కమిషన్‌ పేర్కొంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 837పోస్టులకు 74, 478 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 55వేల మంది పరీక్ష రాశారు. అయితే ప్రశ్నపత్రం లీకయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో.. పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.

ఈ పేపర్‌ లీకేజీ వెనుక ఎవరున్నారో తేల్చాలి: టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. యువత జీవితాలను నాశనం చేసేందుకే భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతున్నట్లు ఉందని భావించారు. ఈ లీకేజీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాలని డీజీపీకి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

అసలేం జరిగింది: టీఎస్‌పీఎస్సీలో టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ప్రశ్నపత్రాల లీకేజీ అయ్యాయన్న విషయాన్ని పోలీసులు కమిషన్‌లోని అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లి వారిని అప్రమత్తమయ్యేలా చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు పేపర్‌ లీకేజీ అయ్యిందని నిర్ధారించాయి. వెంటనే వారు దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో .. మొత్తం డొంక కదిలింది. ఆ తర్వాత వెంటనే ఆరెండు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

పేపర్‌ లీకేజీలో ప్రధాన నిందితునిగా టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడైన ప్రవీణ్‌ను అరెస్ట్‌ చేశారు. అక్కడ నుంచి ఆ పేపర్‌ లీకేజీలో సంబంధం ఉన్న కమిషన్‌లో ఉద్యోగులు, బయట వ్యక్తులు 9 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ప్రవీణ్‌ గ్రూప్‌ 1 ఎగ్జామ్‌ రాసి.. అందులో 103 మార్కులు రావడంతో.. ఈ పరీక్షా పేపర్‌ కూడా లీకేజీ అయ్యి ఉంటుందని అనుమానం మొదలైంది. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు, విపక్షాలు, యువజన సంఘాల నాయకులు అందరూ టీఎస్‌పీఎస్సీని ముట్టడించారు. దీంతో రాష్ట్ర డీజీపీ ఈ లీకేజీ గురించి సిట్‌తో కమిటీని వేసి దర్యాప్తు చేయించారు.

సిట్‌ దర్యాప్తులో భాగంగా కార్యాలయంలోని ప్రవీణ్‌తో పరిచయం ఉన్న అందరినీ విచారించారు. కాన్ఫిడెన్షియల్‌ విభాగంలోని రాజశేఖర్‌ వల్లనే.. అక్కడి కంప్యూటర్లు ద్వారానే ఈ పేపర్‌ లీకేజీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఏఈ, టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ప్రశ్నాపత్రాలను తస్కరించి.. రేణుక, ఆమె భర్త డ్యాకాకు అమ్మినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 15, 2023, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.