అసోంలో మొత్తం 126 స్థానాలకు గానూ 13 జిల్లాల్లోని 39 నియోజకవర్గాలకు గురువారం రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 345 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 73 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,592 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరగనుంది.
పటిష్ఠ భద్రత..
ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బలగాలను మోహరించామని వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు కొవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
ఇదీ చదవండి: 'అసోంను మరోసారి అలా కానివ్వం'
బంగాల్, అసోం రెండో దశ ఎన్నికల ప్రచారానికి తెర