ETV Bharat / bharat

దేశంలో కొత్త ఫంగస్- ఆగ్రాలో తొలి కేసు - ఆగ్రాలో ఆస్పర్​గిలిస్ ఫంగస్ వార్తలు

బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్​లకు అదనంగా ఆస్పర్​గిలస్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. ఉత్తర్​ప్రదేశ్ ఆగ్రాలోని ఓ రోగికి ఈ వ్యాధి నిర్ధరణ అయింది. ఈ వ్యాధి చికిత్స బ్లాక్ ఫంగస్ మాదిరి కాదని నిపుణులు చెబుతున్నారు.

aspergillus-fungus-confirmation-in-a-patient-of-agra
దేశంలో కొత్త ఫంగస్- ఆగ్రాలో తొలి కేసు
author img

By

Published : Jun 1, 2021, 5:51 PM IST

దేశాన్ని ఓవైపు కరోనా పీడిస్తుంటే.. మరోవైపు బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్​లు కూడా విరుచుకుపడుతున్నాయి. ఈ సమయంలో మరో కొత్త రకం ఫంగస్ బయటపడింది. ఆగ్రాలోని ఎస్ఎన్​ మెడికల్ కళాశాలలో చేరిన ఓ రోగికి ఆస్పర్​​గిలస్ ఫంగస్ సోకిందని వైద్యులు తెలిపారు.

మే 28న రోగి ఆస్పత్రిలో చేరారు. ముక్కులో ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. రోగి నమూనాలను పరీక్షించగా ఆస్పర్​గిలస్ ఫంగస్ అని తేలింది. ఈ వ్యాధి చికిత్స బ్లాక్ ఫంగస్ మాదిరి కాదని ఈఎన్​టీ నిపుణుడు డాక్టర్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

"ఆస్పర్​గిలస్ ఫంగస్ వ్యాధి లక్షణాలు భిన్నంగా ఉండకపోయినా.. బ్లాక్ ఫంగస్​తో పోలిస్తే చికిత్స విధానాలు మాత్రం వేర్వేరు. ఆస్పర్​గిలస్ ఇన్ఫెక్షన్​కు వోరికొనజోల్ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఈ వ్యాధి సోకిన రోగికి ముందుగా ముక్కుకు ఆపరేషన్ చేశాం. ఈ సందర్భంగా చాలా అవయవాలు దెబ్బతిన్నాయని గుర్తించాం. ముక్కు లోపలి భాగం నల్లగా మారిపోయింది. అనంతరం ఆస్పర్​గిలస్ చికిత్స ప్రారంభించాం."

-వైద్యుడు ప్రతాప్ సింగ్

మరోవైపు ఇప్పటివరకు 47 మంది బ్లాక్ ఫంగస్ అనుమానిత రోగులు ఎస్ఎన్ఎంసీలో చేరారని తెలిపారు ప్రతాప్. ఈఎన్​టీ నిపుణులు, కంటి నిపుణులు నిరంతరం రోగులపై పర్యవేక్షణ సాగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 26 మంది బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స అందించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి- నదిలో మృతదేహాలు- పీక్కు తింటున్న కుక్కలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.