Diecast Models: పాతకాలం నాటి వస్తువులు, కరెన్సీ, ఫొటోలు సేకరించడం సహజం. కానీ.. బిహార్ పట్నాలోని అశోక్ రాజ్‌పథ్ ప్రాంతానికి చెందిన ఆసిఫ్ వసీ ఇందుకు భిన్నం. మార్కెట్లోకి కొత్తగా వచ్చే బైక్‌లు, కార్లు అంటే అతడికి విపరీతమైన ఇష్టం. ఎక్కడ కొత్తవి కనిపించినా.. వాటి డైకాస్ట్ మోడళ్లను సేకరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. లక్షల విలువ కలిగిన కార్లు, విమానాలు, జీప్‌లు, బైక్‌ల డైకాస్ట్ మోడళ్లను సేకరించే పనిలో వసీ.. 25 ఏళ్లుగా తీరిక లేకుండా ఉన్నాడు. ఇప్పటివరకు దాదాపు 10 వేలకుపైగా డైకాస్ట్ మోడళ్లను పోగుచేశాడు. చిన్నప్పుడు కాగితాలతో కార్ల నమూనాలను అచ్చుగుద్దినట్లుగా తయారుచేసే అలవాటు ఉన్న వసీ.. ఇప్పుడు డైకాస్ట్ మోడళ్ల సేకరణలో నిమగ్నమయ్యాడు.
![Asif Wasi from Patna Fond of Diecast models of vehicles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15017282_jds.jpg)
![Asif Wasi from Patna Fond of Diecast models of vehicles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15017282_dsr.jpg)
![Asif Wasi from Patna Fond of Diecast models of vehicles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15017282_drs.jpg)
''ద్విచక్రవాహనాల కలెక్షన్లలో.. బజాజ్ స్కూటర్లు, లాంబ్రెట్టా, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ బైక్, కేటీఎం, హోండా, హీరో హోండా ఉన్నాయి. ఫోర్- వీలర్లో బీఎండబ్ల్యూ, ఆడి, లాంబోర్గిని, హ్యుందాయ్, మారుతీ ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. భారత్ సహా పలు దేశాల ఎయిర్లైన్లకు చెందిన విమానాల మోడళ్లు ఉన్నాయి.''
- ఆసిఫ్ వసీ
కార్లు, విమానాలు వంటి వాహనాలు మార్కెట్లోకి వచ్చే ముందు విడుదల చేసే నకలునే డైకాస్ట్ మోడల్స్ అంటారు. ఇవి బొమ్మల్లా కనిపిస్తాయి కానీ.. అలా కావు. వినియోగదారులకు వాహనాలను విక్రయించే ముందు.. వాటి ఫీచర్లను ఈ డైకాస్ట్ మోడళ్లలోనే చూపిస్తారు.
![Asif Wasi from Patna Fond of Diecast models of vehicles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-pat-03-daicost-models-of-asif-7210984_12042022151837_1204f_1649756917_401.jpg)
![Asif Wasi from Patna Fond of Diecast models of vehicles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-pat-03-daicost-models-of-asif-7210984_12042022151837_1204f_1649756917_1039.jpg)
ఇవీ చూడండి: అదో మామూలు బ్యాగ్ అనుకున్నారు.. ఓపెన్ చేస్తే రూ.24 కోట్లు...