ETV Bharat / bharat

గుజరాత్​లో కేజ్రీవాల్​కు చేదు అనుభవం.. వాటర్​ బాటిల్​తో దాడి! - భాజపాపై కేజ్రీవాల్ విమర్శలు

గుజరాత్​ పర్యటనలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్​కు చేదు అనుభవం ఎదురైంది. రాజ్​కోట్​లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్​పై గుర్తు తెలియని ఓ వ్యక్తి ప్లాస్టిక్ బాటిల్​ను విసిరాడు. మరోవైపు కాంగ్రెస్​, భాజపాలు కుమక్కయ్యాయని కేజ్రీవాల్ ఆరోపించారు.

Arvind Kejriwal Gujarat tour
అరవింద్ కేజ్రీవాల్
author img

By

Published : Oct 2, 2022, 4:28 PM IST

అరవింద్ కేజ్రీవాల్​పై పాస్టిక్ బాటిల్​ విసిరిన దుండగుడు

గుజరాత్​ పర్యటనకు వెళ్లిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై గుర్తు తెలియని ఓ వ్యక్తి వాటర్ బాటిల్​ను విసిరాడు. అయితే ఆ బాటిల్ కేజ్రీవాల్ తలపై నుంచి వెళ్లి పక్కన పడింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆప్ అధినేత రాజ్​కోట్​లో గర్బా కార్యక్రమంలో పాల్గొనగా.. ఈ ఘటన జరిగింది.

గోవు సంరక్షణకు రూ.40..
ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే గోసంరక్షణ కోసం నిధులు కేటాయిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ప్రతి గోవుకు రోజుకు రూ.40 ఇస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ ఓట్లను చీల్చడానికి అధికార భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. గుజరాత్​లో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఆప్ విజయం సాధిస్తుందని తెలిపారు. భాజపా వ్యతిరేక ఓట్లను చీల్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుందని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సీట్లకు మించి గెలవదని జోస్యం చెప్పారు.

"గుజరాత్​ ప్రయోజనాల కోసం ఆప్​కు ఓటు వేయండి. కాంగ్రెస్​కు ఓటు వేయడం వ్యర్థం. భాజపాపై విరక్తి చెందిన చెందినవారందరూ ఆప్​కు ఓటేయండి. ఆప్​ను ఓడించేందుకు భాజపా, కాంగ్రెస్ ఉమ్మడి వ్యూహం రచించాయి. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 వేల కోట్ల ప్యాకేజీ వల్ల.. కాంట్రాక్టర్లు, మంత్రులకు తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రజలకు మెరుగైన విద్య, ఉద్యోగాలు, కరెంట్ కావాలి."
-- అరవింద్ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

ఇవీ చదవండి: మార్నింగ్​ వాక్​ చేస్తున్న వారే టార్గెట్.. బైక్​పై వచ్చి కాల్పులు.. లక్కీగా ముగ్గురు...

'స్కెచ్​లు కాదు.. ఇక నేరుగా PK సమరం'!.. 3,500 కి.మీ పాదయాత్ర ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.