రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ ఐఐటీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా మొత్తం 65-70 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వారిలో 60 మందికి కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్టు అధికారులు తెలిపారు.
అయితే.. చండీగఢ్, గుజరాత్, జైపుర్‌లోని గిరిజన ప్రాంతాల వారి వల్లే వైరస్ వ్యాప్తి చెందిందని డిప్యూటీ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ పి.సింగ్ అన్నారు.
"మార్చి 11న వైరస్ సోకిన(గిరిజన ప్రాంతాల) వారు కొందరు ఇక్కడకు వచ్చారు. వారి నుంచే కరోనా విస్తరించింది. బాధితుల్లో విద్యార్థులే అధికంగా ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు. క్యాంపస్‌లోని జీ3 బ్లాక్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాం."
- పి.సింగ్, డిప్యూటీ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, జోధ్‌పుర్
జోధ్‌పుర్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నందున పోలీసులు, వైద్యాధికారులు అప్రమత్తమయ్యారని సింగ్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేశామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కొవిడ్ పంజా: దేశంలో ఒక్కరోజే లక్షకుపైగా కేసులు