ఉత్తరాఖండ్లో సమాచార హక్కు చట్టం కింద విడుదల చేసిన అత్యాచార కేసుల వివరాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. 2019 నాటికి గత 19 ఏళ్లలోనే 4000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అంటే ప్రతి ఏటా సరాసరి 200 మంది మహిళలు రేప్ బాధితులుగా మారారు.
3956 అత్యాచార కేసులు, 19 యాసిడ్ దాడి కేసులు నమోదయ్యాయని ఆర్టీఐ చట్టం కింద హల్ద్వారాకు చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు హేమంత్ గోనియా ఈ వివరాలు వెల్లడించారు. రూ.4కోట్ల 81లక్షల 80వేలను అత్యాచార బాధితుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. యాసిడ్ దాడి బాధితులకు రూ. 17 లక్షల 90 వేలను ఖర్చుచేసింది.
''ఉత్తరాఖండ్లో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతీ సంవత్సరం అత్యాచార కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టడానికి దృఢమైన చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. రేప్ కేసులు, యాసిడ్ దాడుల్లో దోషుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.''
- హేమంత్ గోనియా,డిప్యూటి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు
ఇదీ చదవండి:కన్న కొడుకుల్ని చంపి.. తానూ ఆత్మహత్య