ఆర్మీ దళంలోని వైమానిక విభాగంలో మహిళా పైలట్లను నియమించాలని భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత మహిళా అధికారులకు జులైలో శిక్షణ ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
జనవరి 15న ఆర్మీ దినోత్సవం పురస్కరించుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భారత సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవాణె.. వైమానిక విభాగంలో మహిళా అధికారుల నియామకంపై నెల క్రితమే ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
వైమానిక విభాగంలో మహిళలు ఇప్పటివరకు ట్రాఫిక్ కంట్రోల్, గ్రౌండ్ డ్యూటీస్ మాత్రమే నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో ఆర్మీ ఓ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.