ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

pulwama encounter
పుల్వామాలో ఎన్​కౌంటర్
author img

By

Published : Jul 2, 2021, 9:07 AM IST

Updated : Jul 2, 2021, 4:55 PM IST

09:53 July 02

పుల్వామా ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో రాజ్​పుర్​ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య శుక్రవారం పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మిలిటెంట్లు హతమవగా ఓ జవాన్​ వీరమరణం పొందారు. మిలిటెంట్లు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు. మృతుల్లో లష్కరే తోయిబా జిల్లా కమాండర్, పాకిస్తాన్‌ ఉగ్రవాది ఉన్నారు.

హన్జిన్​ గ్రామంలో ముష్కరులు ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని వారి కోసం గాలింపు చేపట్టారు. బలగాలను గుర్తించిన ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తం అయిన అధికారులు.. ముష్కరులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు.

09:03 July 02

పుల్వామాలో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ జవాన్​ వీరమరణం పొందారు.

Last Updated : Jul 2, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.