ETV Bharat / bharat

Army Chief: తూర్పు లద్దాఖ్​​లో పర్యటించిన సైన్యాధిపతి - నరవాణే లద్దాఖ్​ పర్యటన

ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎమ్ఎమ్ నరవణే (Army Chief) రెండు రోజుల పర్యటనలో భాగంగా లద్దాఖ్​కు వెళ్లారు. తూర్పు లద్దాఖ్​లోని పలు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు.

Naravane Ladakh visit
కశ్మీర్​లో ఆర్మీ చీఫ్​​ జనరల్​​ నరవాణే
author img

By

Published : Oct 1, 2021, 9:21 PM IST

జమ్ముకశ్మీర్​లో వాస్తవాధీన రేఖ (Line Of Actual Control) వద్ద భద్రతపై ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణే (Army Chief) సమీక్షించారు. శుక్రవారం తూర్పు లద్దాఖ్​లోని (ladakh news) సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన భద్రతా పరిస్థితులను పరిశీలించారని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న పరిస్థితులపై వివరించారు. ఈ పర్యటనలో సైనికులతో మాట్లాడిన సైన్యాధిపతి వారిని అభినందించినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

Army Chief General Mukund Naravane on two-day visit to Ladakh
తూర్పు లద్దాఖ్​లో నరవణే పర్యటన

పరిస్థితులను ఆర్మీ చీఫ్​కు వివరిస్తున్నఅధికారులు

సైనికులతో ఆర్మీ చీఫ్​​ జనరల్​​ నరవణే

వాస్తవాధీన రేఖ (Line Of Actual Control) వెంబడి చైనా పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తూనే ఉందని విదేశాంగ ప్రతినిధి ఆరిందమ్​ బాగ్చీ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించి భారత సైనికులు తగిన రీతిలో బుద్ధి (India China Border Dispute) చెప్పాలని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జనరల్​​ నరవణే పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ముగ్గురు ఉగ్ర అనుచరులు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.