ETV Bharat / bharat

'సైన్యంలో మహిళా అధికారులకు 10 రోజుల్లో శాశ్వత కమిషన్​' - ఆర్మీ శాశ్వత కమిషన్​

మహిళా సైన్యాధికారులకు శాశ్వత కమిషన్​ హోదా కల్పిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది(Permanent Commission For Women). గతంలో ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినందుకు సైన్యంపై చర్యలు తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించిన నేపథ్యంలో ఈ మేరకు తెలిపింది. 10 రోజుల్లోగా త్వరితగతిన చర్యలు చేపడతామని పేర్కొంది.

Army agrees to grant Permanent Commission to 11 women after SC warns of contempt
మహిళా సైన్యాధికారుల శాశ్వస కమిషన్​కు కేంద్రం ఓకే
author img

By

Published : Nov 12, 2021, 3:25 PM IST

Updated : Nov 12, 2021, 7:04 PM IST

సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్​ హోదాను ఇచ్చేలా 10 రోజుల్లోగా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది(supreme court permanent commission).

39 మంది మహిళా సైన్యాధికారులకు నవంబర్​ 1 నాటికి శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలని సుప్రీం గతంలో తీర్పునిచ్చింది(permanent commission in indian army). అర్హతా ఉన్నా తమకు ఇంకా ఆ హోదా ఇస్తూ ఆర్మీ ఉత్తర్వులు ఇవ్వలేదని తాజాగా 11మంది మహిళా సైన్యాధికారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు తెలిపింది.

ఏం జరిగిందంటే..?

సైన్యంలో 14ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరి 17న తీర్పు వెలువరించింది(permanent commission army). ఫలితంగా సైన్యం ఓ కమిటీని ఏర్పాటు చేసి 400 మందికి పైగా మహిళా అధికారులకు ఈ హోదా(Permanent Commission For Women) కల్పించింది. మహిళా అధికారుల వార్షిక రహస్య నివేదిక సమీక్ష ఆధారంగా.. కొందరికి ఈ హోదా నిరాకరించింది. శాశ్వత కమిషన్‌ తిరస్కరణకు గురైన 72 మంది అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 72 మందిలో 39 మంది మహిళా అధికారులు మాత్రమే శాశ్వత కమిషన్‌కు అర్హులుగా గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. మరో ఏడుగురు వైద్యపరంగా ఫిట్‌గా లేరని, 25 మందిపై క్రమశిక్షణారాహిత్య అభియోగాలున్నాయని పేర్కొంది.

కేంద్రం నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ 39 మందికి నవంబరు 1 లోగా.. శాశ్వత కమిషన్‌ హోదా కల్పించాలని గత నెలలో ఆదేశించింది. మిగతా 25 మంది శాశ్వత కమిషన్‌ను ఎందుకు అనర్హులో కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది. అయితే గడువు ముగిసినా శాశ్వత హోదా కల్పించకపోవడం వల్ల 11మంది మహిళా అధికారులు తాజాగా కోర్టును ఆశ్రయించారు. దీంతో అర్హులైన వారందరికీ హోదా కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది(permanent commission in indian army).

ఇదీ చదవండి: కరోనా టీకా తీసుకోకపోతే క్రిమినల్​ కేసు.. కలెక్టర్ కఠిన ఆదేశాలు

Last Updated : Nov 12, 2021, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.