ETV Bharat / bharat

'దేశంలో మతోన్మాదం, విద్వేషపు సునామీ.. అడ్డుకోకుంటే అంతే!'

Sonia Gandhi fire on BJP: భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. దేశాన్ని అసహనం, ద్వేషం, మతోన్మాదం చుట్టుమడుతున్నాయని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని.. దేశ యంత్రాంగాన్ని వారిపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.

sonia article on bjp rule
sonia article on bjp rule
author img

By

Published : Apr 16, 2022, 3:42 PM IST

Updated : Apr 16, 2022, 10:26 PM IST

Sonia Gandhi fire on BJP: భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. అసహనం, ద్వేషం, మతోన్మాదం దేశాన్ని చుట్టుమడుతున్నాయని మండిపడ్డారు. వీటిని వెంటనే ఆపకపోతే.. పునర్నిర్మించలేని స్థితికి సమాజం దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఇలాంటి పరిస్థితులు కొనసాగేందుకు అనుమతించకూడదని ఓ న్యూస్​పేపర్​ సంపాదకీయంలో పేర్కొన్నారు.

Sonia Gandhi newspaper article: 'ద్వేషం, మతోన్మాదం, అసహనం, అసత్యం దేశాన్ని చుట్టుముడుతున్నాయి. వీటిని ఇలాగే కొనసాగనివ్వకూడదు. దేశ ప్రజలుగా మనం వీటిని చూస్తూ ఉండిపోకూడదు. నకిలీ జాతీయవాదం కోసం మన దేశంలోని శాంతి, బహుళత్వాన్ని త్యాగం చేయకూడదు. గడిచిన తరాలలో నిర్మించినవన్నీ నేలకూలే ముందే ఈ విద్వేషపు సునామీని అడ్డుకోవాలి. దేశంలో విభజన ఇలా శాశ్వతంగా ఉండిపోవాల్సిందేనా? ఇలాంటి పరిణామాలే తమకు మేలు చేస్తాయని ప్రజలు భావించాలని ప్రస్తుత ప్రభుత్వం కోరుకుంటోంది.'

Sonia Gandhi on Hijab row: కర్ణాటకలో హిజాబ్ వివాదం, రామనవమి సందర్భంగా దేశంలో ఘర్షణలు, జేఎన్​యూలో మాంసాహారంపై గొడవ వంటి అంశాలనూ తన ఆర్టికల్​లో పరోక్షంగా ప్రస్తావించారు సోనియా. 'దుస్తులు, ఆహారం, విశ్వాసాలు, పండగలు, భాష.. ఇలా ఏ అంశమైనా దేశంలోని పౌరులను తమ తోటి పౌరులకు వ్యతిరేకంగా మారుస్తున్నారు. అసమ్మతి శక్తులకు ప్రోత్సాహం లభిస్తోంది. విలువైన వనరులను దేశ భవిష్యత్ ​కోసం, యువతను అభివృద్ధి చేయడం కోసం ఉపయోగించడం మాని.. గతంలో జరిగిన సంఘటనలకు ఊహాగానాలు జోడించి ప్రస్తుత పరిణామాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు' అని సోనియా పేర్కొన్నారు.

అధికారంలో ఉన్నవారికి అనుకూలమైన భావజాలం లేకపోతే.. అణచివేస్తున్నారని సోనియా ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని.. దేశ యంత్రాంగాన్ని వారిపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. 'సామాజిక కార్యకర్తలను బెదిరించి నోరుమూయిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలను విష ప్రచారం చేస్తున్నారు. కనిష్ఠ ప్రభుత్వం గరిష్ఠ పాలన అని చెప్పుకునే ఈ ప్రభుత్వానికి 'భయం, మోసం, బెదిరింపు'లే మూలస్తంభాలుగా మారిపోయాయి' అని సోనియా వ్యాఖ్యానించారు.

రాహుల్ ట్వీట్..: సోనియా సంపాదకీయాన్ని ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ సైతం భాజపాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భాజపా-ఆరెస్సెస్ వ్యాప్తి చేస్తున్న విద్వేషానికి ప్రతిఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మిళిత జీవనం, కలిసి పండగలు జరుపుకోవడం భారతదేశ నిజమైన సంస్కృతి అని పేర్కొన్న రాహుల్.. దీన్ని కాపాడేందుకు అందరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

13 పార్టీల సంయుక్త ప్రకటన: దేశంలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు, విద్వేషపూరిత ప్రకటనలపై దేశంలోని విపక్ష పార్టీలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజలంతా సంయమనంతో శాంతి సామరస్యాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు దేశంలోని 13 విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆహారం, వేషధారణ, నమ్మకాలు, పండుగలు, భాష ఆధారంగా సమాజం చీలిపోతున్నట్లు విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. మతోన్మాదుల మాటలు, చర్యలను ఖండించకుండా ప్రధాని మౌనం వహించడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొన్నాయి. ఈ మౌనమే సంఘ వ్యతిరేక శక్తులకు అస్త్రంగా మారుతోందని మండిపడ్డాయి. శతబ్దాల పాటు దేశం సుసంపన్నంగా విలసిల్లేందుకు కారణమైన సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు సమష్టి కృషి చేస్తామని 13విపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన ద్వారా హామీ ఇచ్చాయి. సంయుక్త ప్రకటన చేసిన పార్టీల అధినేతల్లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతోపాటు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, బంగాల్‌, తమిళనాడు, ఝార్ఖండ్‌ సీఎంలు ఉన్నారు.

ఇదీ చదవండి:

108 అడుగుల హనుమాన్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

కాంగ్రెస్‌లోకి పీకే? సోనియా, రాహుల్‌తో భేటీ..

Last Updated : Apr 16, 2022, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.