AP SI Results Released: ఏపీలో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఎట్టకేలకు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్ విధానంలో తుది ఫలితాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గత ఏడాది నవంబర్‌లో మొత్తం 411 ఎస్సై పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఈ ఉద్యోగాలకు 1లక్ష 73 వేల 47 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
అయితే ఈ పరీక్షకు ఈ సంవత్సరం ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. 1లక్ష 51వేల 288మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫిబ్రవరి 28న ప్రిలిమినరీ ఫలితాలను రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షల్లో 57వేల 923 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
అర్హత సాధించిన వారికి రిక్రూట్‌మెంట్ బోర్డు దేహదారుఢ్య పరీక్ష పీఎంటీ/పీఈటీకు హాల్‌టికెట్లను జారీ చేసింది. ఈ దేహదారుఢ్య పరీక్షలో 31వేల 193 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వారికి తుది రాత పరీక్ష రాయడానికి హాల్ టికెట్లను జారీ చేశారు. తుది రాత పరీక్షలో నాలుగు పేపర్లకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలను అధికారులు తాజాగా విడుదల చేశారు.