AP CID Chief Sanjay on Chandrababu Naidu Arrest: 550 కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన కేసులో చంద్రబాబు ఇన్‌వాల్వ్ అయ్యారని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో చంద్రబాబును అరెస్టు చేశామని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని.. ఏపీలో ఎక్స్‌లెన్స్ సెంటర్లు పెట్టేందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
AP CID on Skill Development Scam: 300 కోట్లు నష్టం.. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అంచనా విలువ రూ.330 కోట్లు అని పేర్కొన్న సంజయ్.. ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.300 కోట్ల వరకూ ప్రభుత్వానికి నష్టం జరిగిందని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం రూ.371 కోట్లు విడుదల చేసిందని.. డిజైన్ టెక్ అనే సంస్థకు ఆ డబ్బులను విడుదల చేసినట్లు చెప్పారు. ఆ మొత్తం సొమ్ము విడుదలకు కేబినెట్ ఆమోదం సైతం లేదని అన్నారు.
Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు
దుబాయ్, అమెరికాకు వెళ్తున్నాయి: డిజైన్ టెక్ నుంచి పీవీఎస్పీ, ఏసీఐ, ఎలైట్ వంటి షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయని.. ఈ షెల్ కంపెనీల నుంచి మరికొన్ని షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయని అన్నారు. డిజైన్ టెక్‌కు చెందిన మనోజ్ పర్డాసాని, చంద్రబాబు కార్యదర్శి శ్రీనివాస్ పరారీలో ఉన్నారని.. నిందితుల గాలింపు కోసం సీఐడీ బృందాలు దుబాయ్, అమెరికాకు వెళ్తున్నాయని తెలిపారు.
షెల్ కంపెనీలకు బదిలీ: ఆ మొత్తం సొమ్ములో చాలా వరకూ నకిలీ పత్రాల ద్వారా షెల్ కంపెనీలకు బదిలీ చేశారన్న సంజయ్.. ఈ కుంభకోణం దర్యాప్తులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా గుర్తించామని తెలిపారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే కుంభకోణం జరిగిందని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు చెందిన కీలక పత్రాలు కొన్ని గల్లంతయ్యాయని అన్నారు.
కీలకమైన కొన్ని పత్రాల గల్లంతులో చంద్రబాబు, ఇంకొందరు ప్రధాన నిందితులు ఉన్నారన్న సీఐడీ అదనపు డీజీ.. వికాస్ కన్వెల్కర్ సహా ఇతరులు ఈ అక్రమాల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. గల్లంతైన నిధుల విషయంలో విచారణ చేయాలని అని చెప్పిన సంజయ్.. చంద్రబాబును కస్టోడియల్ విచారణకు తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు.
Ganta Srinivasa Rao Arrested: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టు
విచారణను ప్రభావితం చేసే అవకాశం: చంద్రబాబు బయటఉంటే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే చంద్రబాబును కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. నిధుల విడుదల విషయంలో నిర్ణయాత్మక పాత్ర చంద్రబాబుదే అని.. కార్పొరేషన్ సెక్రటరీ, లోకేశ్‌ను కూడా విచారించాల్సిన అవసరం ఉందని అన్నారు.
CID Chief Sanjay on Nara Lokesh: నారా లోకేశ్ పాత్రపై విచారణ.. నేరం రుజువైతే చంద్రబాబుకు పదేళ్ల కంటే ఎక్కువే శిక్ష పడే అవకాశం ఉందన్న సీఐడీ అదనపు డీజీ సంజయ్.. ఇవాళ చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఇది కీలక ఆర్థిక నేరం కాబట్టి ఈడీ, జీఎస్టీ ఇంటెలిజెన్స్ కూడా విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నారా లోకేశ్, రాజేశ్ పాత్ర ఎంతో తేలుస్తామన్న సీఐడీ.. ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులోనూ లోకేశ్ పాత్రపై విచారణ చేస్తామని అన్నారు.
అంతిమ లబ్దిదారు చంద్రబాబే: ఈ కేసును లోతుగా విచారణ చేశామని, ఆధారాలు కోర్టు ముందు ఉంచినట్లు చెప్పారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అంతిమ లబ్దిదారు చంద్రబాబేనన్న సంజయ్.. చంద్రబాబు కీలక పాత్రధారి కాబట్టే అరెస్టు చేసినట్లు తెలిపారు. దీనిపై తదుపరి చర్యలు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని అన్నారు.
రూ. 540 కోట్ల వ్యయంతో 6 ఎక్సలెన్స్ కేంద్రాల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారని.. 3000 కోట్ల రూపాయలతో ఎక్స్‌లెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించారని అన్నారు. ఎక్సలెన్స్ కేంద్రాల కోసం రూ. 58 కోట్లతో సాఫ్ట్‌వేర్ కొన్నారని.. రూ. 58 కోట్లతో కొని దాన్నే బాగా పెంచి చూపేందుకు కుట్ర చేశారని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు.