ETV Bharat / bharat

ఆ ఏడు కార్లలోనే వాజే కేసు గుట్టు! - సచిన్ వాజే

అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కేసు సహా సంబంధిత కారు యజమాని హత్య కేసులో ఎన్​ఐఏ ఇప్పటివరకు 7 కార్లను సీజ్​ చేసింది. వీటిలో ఐదు కార్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పోలీస్​ అధికారి సచిన్​ వాజే ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ కార్లకు పోలీస్​ కమిషనర్​ కార్యాలయానికి సంబంధం ఉందని దర్యాప్తులో వెల్లడైంది.

sachin vaze case cars, సచిన్ వాజే
సచిన్​ వాజే
author img

By

Published : Apr 1, 2021, 3:00 PM IST

దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కేసు, మన్​సుఖ్​ హిరేన్ మృతి​ కేసుల్లో ఎన్​ఐఏ దర్యాప్తు కార్ల చుట్టూ తిరుగుతోంది. ముంబయిలోని​ అంబానీ నివాసం వద్ద కలకలం రేపిన స్కార్పియోతో మొదలు ఇటీవల ఔట్​ల్యాండర్​ వరకు ఈ కేసులో ఇప్పటివరకు 7 కార్లు స్వాధీనం చేసుకుంది జాతీయ దర్యాప్తు సంస్థ. వీటిలో కొన్ని వాహనాలకు ముంబయి నగర పోలీస్ కమిషనరేట్​తో సంబంధం ఉన్నట్లు తేలగా... మున్ముందు ఈ దర్యాప్తు ఎలా సాగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

sachin vaze case cars, సచిన్ వాజే
సీజ్​ చేసిన కార్లు

సీజ్​ చేసిన కార్లలో మెర్సిడిస్​, వోల్వో వంటి విలావంతమైన కార్లు ఉండటం గమనార్హం. వీటిని మాజీ పోలీస్​ అధికారి, ప్రస్తుతం ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన్​ వాజే ఉపయోగించారని తొలుత దర్యాప్తు చేపట్టిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వెల్లడించింది. ఇన్నోవా, స్కార్పియో, 1 మెర్సిడిస్​, ప్రాడో సహా ఔట్ ల్యాండర్​ కార్లనూ వాజే వాడారని తెలిసింది.

వాజే కార్లు..

వాజే ఉయోగించిన కార్లలో ఎన్​ఐఏ మొదట స్వాధీనం చేసుకున్నది ఇన్నోవా. ఘటన జరిగిన రోజు ఆ ప్రాంతంలో వాజే ఈ కారులో అంబానీ నివాసం మీదుగా ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారు క్రైం ఇంటెలిజెన్స్​ యూనిట్​ చెందినదని దర్యాప్తులో తెలిసింది.

అంబానీ నివాసం వద్ద కలకలం రేపిన స్కార్పియో కూడా నాలుగు రోజుల ముందు పోలీస్​ కమిషనర్​ కార్యాలయం వెలుపల పార్క్​ చేసి ఉందని దర్యాప్తులో వెల్లడైంది.

వాజేకు చెందిన మరో కారు మెర్సిడిస్​. ఈ కారులోనే వాజే.. స్కార్పియో కారు యజమాని అయిన మన్​సుఖ్​ హిరేన్​తో​ ఫిబ్రవరి 17న భేటీ అయ్యారని తేలింది. భేటీ తర్వాత స్కార్పియో కారు తాళాలు తీసుకుని ఈ కారులోనే కార్యాలయానికి వచ్చారని దర్యాప్తులో తెలిసింది. ఈ కారును వాజే తరచూ కమిషనర్​ కార్యాలయానికి తీసుకువచ్చేవారని సమాచారం.

ఎన్​ఐఏ సీజ్​ చేసిన మరో కారు ప్రాడో కూడా వాజేకు చెందినదే. వాంగ్మూలం నమోదు చేయడం కోసం మన్​సుఖ్​ను వాజే ఈ కారులోనే పోలీస్​ కమిషనరేట్​కు తీసుకువచ్చారని దర్యాప్తులో వెల్లడైంది.

ఇటీవల సీజ్​ చేసిన ఔట్​ల్యాండర్​ కారుకు సంబంధించి ప్రకాశ్​ హోవల్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఎన్​ఐఏ విచారిస్తోంది.

ఇప్పటివరకు ఎన్​ఐఏ 2 మెర్సిడిస్​, 1 ఇన్నోవా, 1 ప్రాడో, 1 వోల్వో, 1 ఔట్​ ల్యాండర్​ కార్లను ఎన్​ఐఏ స్వాధీనం చేసుకుంది.

ఇదీ చదవండి : 'ఆ పేలుడు పదార్థాలు కొన్నది సచిన్‌ వాజేనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.