ETV Bharat / bharat

దిల్లీలో మళ్లీ 'ఆపరేషన్ బుల్డోజర్'.. అడ్డుకున్న ఎమ్మెల్యే అరెస్ట్ - దిల్లీ న్యూస్​

Delhi Encroachment Drive: దిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతూనే ఉంది. షాహీన్​బాగ్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల సోమవారం వెనక్కితగ్గిన అధికారులు.. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో తిరిగి కూల్చివేతలను ప్రారంభించారు. అడ్డుకోబోయిన స్థానిక ఎమ్మెల్యేను అరెస్ట్​ చేశారు పోలీసులు.

Delhi Encroachment Drive
Delhi Encroachment Drive
author img

By

Published : May 10, 2022, 12:35 PM IST

Updated : May 10, 2022, 3:27 PM IST

దిల్లీలో మళ్లీ 'ఆపరేషన్ బుల్డోజర్'.. అడ్డుకున్న ఎమ్మెల్యే అరెస్ట్

Delhi Encroachment Drive: దేశ రాజధానిలోని దక్షిణ దిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్ పరిధిలో (ఎస్‌డీఎంసీ) అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. షాహీన్​బాగ్​లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల వెనుదిరిగిన అధికారులు.. మంగళవారం న్యూ ఫ్రెండ్స్​ కాలనీ గురుద్వారా​ రోడ్డులోని అక్రమ నిర్మాణాలపై మున్సిపల్​ అధికారులు స్పెషల్​ డ్రైవ్​ చేపట్టారు. ఆక్రమణల కూల్చివేతపై స్థానిక ఎమ్మెల్యే ముఖేష్​ అహ్లావత్​ బుల్డోజర్లను అడ్డుకుని తిరిగి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఆయనను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఉత్తర దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​లోని మంగోల్‌పురిలోనూ ఆక్రమ నిర్మాణాల కూల్చివేతలు సాగుతున్నాయి.

Delhi Encroachment Drive
అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న బుల్డోజర్లు
Delhi Encroachment Drive
అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న బుల్డోజర్​
Delhi Encroachment Drive
పోలీసులతో బందోబస్తు

"గురుద్వారా రోడ్డు, న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై డ్రైవ్​ చేపట్టాం. మా ఎన్​ఫోర్స్​మెంట్​ బృందాలు తగిన పోలీసు బలగాలు, బుల్డోజర్లతో వెళ్లి కూల్చివేతలను ప్రారంభించాయి"

- రాజ్‌పాల్ సింగ్, ఎస్‌డీఎంసీ సెంట్రల్ జోన్ ఛైర్మన్

ఎస్‌డీఎంసీ మొదటి కూల్చివేత డ్రైవ్​లో భాగంగా మే 4 నుంచి 13 వరకు దక్షిణ దిల్లీలోని అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. షాహీన్​బాగ్​లో నిర్మాణాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీ విజ్ఞప్తి మేరకు ఇలాంటి వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అందుకు సుప్రీంకోర్టు వేదిక కాదని, కావాలంటే దిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: షాహీన్​బాగ్​కు మళ్లీ బుల్డోజర్లు.. సుప్రీంలో వారికి చుక్కెదురు!

Last Updated : May 10, 2022, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.