ETV Bharat / bharat

'దేశంలో రైతులపై దాడులు.. ఇంకెన్నాళ్లు?' - ప్రియాంక గాంధీ న్యూస్​

దేశంలోని రైతులు అణచివేతకు గురవుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) ఆరోపించారు. ఈ తరహా క్రూరత్వం.. దేశాన్ని నాశనం చేస్తోందని వ్యాఖ్యానించారు. హిందుత్వం పేరుతో విధ్వంసాన్ని సృష్టించే వారు.. హిందువులే కారని పేర్కొన్నారు.

Rahul Gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Oct 28, 2021, 10:31 PM IST

Updated : Oct 28, 2021, 11:43 PM IST

రైతులకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News).. మరోసారి తన గళం వినిపించారు. దేశంలోని అన్నదాతలు అణచివేతకు గురవుతున్నారని ఆరోపించారు. రైతులపై జరుగుతున్న ఈ తరహా క్రూరత్వం... దేశాన్ని నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. హరియాణా టిక్రీ సరిహద్దులో జరిగిన ట్రక్కు దాడిలో ముగ్గురు మహిళా రైతులు మరణించిన నేపథ్యంలో రాహుల్(Rahul Gandhi News)​ ఈ మేరకు ట్వీట్ చేశారు.

"మదర్ ఇండియా- దేశంలోని రైతులు నలిగిపోతున్నారు. వారిపై జరుగుతున్న ఈ క్రూరత్వం, ద్వేషం.. దేశాన్ని తొలచివేస్తోంది. అందుకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. "

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

రాహుల్ హిందీలో చేసిన తన ట్వీట్​కు FarmersProtest హ్యాష్​ట్యాగ్​ను జత చేశారు.

పకోదా చౌక్ ప్రాంతంలో కొంతమంది మహిళలు... బాహుదూర్​గఢ్​ రైల్వే స్టేషన్​కు వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో వారిపై ఓ ట్రక్కు దూసుకెళ్లగా ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా టిక్రీ సరిహద్దులో జరుగుతున్న రైతుల ఆందోళనలో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

వారు హిందువులు కాదు..

త్రిపురలో ముస్లింలపై క్రూరంగా ప్రవర్తిస్తున్నారని రాహుల్ మరో ట్వీట్​లో ఆరోపించారు. ప్రభుత్వం ఇంకెంత కాలం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. హిందుత్వం పేరుతో హింసకు పాల్పడే వారు మోసకారులు అని పేర్కొన్నారు.

"త్రిపురలో ముస్లింలపై క్రూరత్వం ప్రదర్శిస్తున్నారు. హిందువుల పేరుతో విద్వేషాన్ని, విధ్వంసాన్ని సృష్టించే వారు హిందువులు కాదు. మోసకారులు. ప్రభుత్వం ఇంకెంత కాలం మూగగా, చెవిటిగా నటిస్తుంది?

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా రైతులకు మద్దతుగా భాజపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. "రైతులు ఎంతో కష్టపడుతున్నా వారి పంటలకు సరైన ధర దొరకటం లేదు. పంటలు పండించడానికి ఎరువులు కూడా లభించటం లేదు. ఎరువుల కొరత వల్ల బుందేల్​ఖండ్​లో ఇద్దరు రైతులు మరణించారు. రైతు వ్యతిరేక విధానాలను భాజపా ప్రభుత్వం అనుసరిస్తోంది" అని ఆమె ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి: దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా భాజపా: పీకే

ఇదీ చూడండి: వాంఖడే అరెస్ట్​పై 'మహా' ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

Last Updated : Oct 28, 2021, 11:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.