ETV Bharat / bharat

ఫైవ్ స్టార్​ హోటల్​లో 600రోజులు బస.. బిల్ కట్టకుండానే జంప్.. ఇంతకాలం అలా మేనేజ్ చేశాడంట! - రోజేట్‌ హౌస్‌ హోటల్

Man Free Stay In Hotel : ఏడాదిన్నరకుపైగా ఫైవ్​ స్టార్​ హోటల్​లో ఉన్నాడు ఓ వ్యక్తి. సుమారు 603 రోజులు.. అదే హోటల్​లో గడిపాడు. కానీ బిల్లు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా వెళ్లిపోయాడు! ఈ ఘటన ఎక్కడ జరిగింది? అతడు బిల్లు చెల్లించకుండా ఎలా వెళ్లిపోయాడు?

ankush dutta roseate house
ankush dutta roseate house
author img

By

Published : Jun 21, 2023, 2:29 PM IST

Man Free Stay In Hotel : ఒకరోజు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో గడపడం.. ఇది సామాన్యులకు ఎంతో ఖరీదైన వ్యవహారం. అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా ఏడాదిన్నరకు పైగా ఫైవ్​ స్టార్​ హోటల్​లో ఉన్నాడు. 'చాలా ఖర్చు అయ్యి ఉంటుంది కదా!' అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్​.. అతడు బిల్లు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే.. 603 రోజులు గడిపాడు! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే జరిగింది.

పోలీసులకు వివరాల ప్రకారం.. దిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని ఏరోసిటీలో రోజేట్‌ హౌస్‌ అనే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఉంది. దీంట్లో అంకుశ్‌ దత్తా అనే వ్యక్తి.. 2019 మే 30న ఒకరోజు ఉంటానని రూమ్ బుక్​ చేసుకున్నాడు. కానీ అతడు 2021 జనవరి 22 వరకు అదే రూమ్​లో మొత్తం 603 రోజులు ఉన్నాడు. చివరకు బిల్లు చెల్లించకుండానే తప్పించుకున్నాడు. ఫలితంగా అతడు.. హోటల్​ యాజమాన్యానికి రూ.58 లక్షలు బకాయిపడ్డాడు.

'హోటల్​ లాగిన్​ సాఫ్ట్​వేర్​లో భారీ అవకతవకలు..'
Ankush Dutta Roseate House : తాజాగా ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ వ్యవహారంపై హోటల్‌ ప్రతినిధి ఫిర్యాదు చేశారు. అంకుశ్​ దత్తాకు.. హోటల్ సిబ్బందిలోనే కొందరు సహకరించినట్లు ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. హోటల్‌ లాగిన్‌ సాఫ్ట్‌వేర్‌, అకౌంట్స్‌లో భారీ అవకతవకలకు కొందరు పాల్పడినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. కొంత మొత్తంలో డబ్బు ఆశ జూపి హోటల్‌ సిబ్బందితో అంకుశ్​.. కుట్రకు పాల్పడినట్లు చెప్పారు.

'ఈ కుట్రలో అతడి హస్తం ఉంది!'
అయితే ఒక వ్యక్తి బిల్లు చెల్లించకుండా 72 గంటలకు పైగా రూమ్​లోనే బస చేస్తే.. ఆ విషయాన్ని వెంటనే సిబ్బంది హోటల్‌ సీఈఓ, ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పై స్థాయికి తీసుకెళ్లలేదని హోటల్​ ప్రతినిధి పోలీసులకు వెల్లడించారు. ఈ వ్యవహారం మొత్తంలో హోటల్‌ చెకిన్‌ సాఫ్ట్‌వేర్‌ నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ప్రేమ్‌ ప్రకాశ్‌ అనే ఉద్యోగి హస్తం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇతడు కావాలనే దత్తా బకాయి బిల్లులను ఇతర పెండింగ్‌ బిల్లులతో కలిపి రిపోర్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

'ఆ మూడు చెక్కులు బౌన్స్​ అయ్యాయి!'
నిందితుడు అంకుశ్​ దత్తాకు అనుకూలంగా అనేక నకిలీ బిల్లులను హోటల్​ సిబ్బందే సృష్టించినట్లు ఫిర్యాదు చేసిన వ్యక్తి.. పోలీసులకు చెప్పారు. అంకుశ్‌ మూడు సార్లు వరుసగా రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షలు విలువ చేసే చెక్కులను ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ ఆ చెక్కులు బౌన్స్‌ అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కూడా సిబ్బంది దాచిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

'అంకుశ్​ను కఠినంగా శిక్షించాల్సిందే'
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో హోటల్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. నేరం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.