ETV Bharat / bharat

ఈద్గా మైదానంలో 'గణేశ్​' వేడుకలు.. సుప్రీంకోర్టులో ఇస్లాం సంస్థ సవాల్​

author img

By

Published : Aug 31, 2022, 11:16 AM IST

Idgah Maidan : కర్ణాటకలోని హుబ్లీ.. ఈద్గా మైదానంలో గణేశుడి ఉత్సవాలు జరిపేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడం వల్ల అంజుమన్​ ఇస్లాం సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అది తెలుసుకున్న ఉత్సవ కమిటీ సభ్యులు.. వెంటనే గణపయ్య చిన్ని విగ్రహాన్ని ప్రతిష్ఠంచి పూజలు చేశారు.

Ganesh Chaturthi festival at Hubballi Idgah maidan

Idgah Maidan : కర్ణాటక.. హుబ్లీలోని ఈద్గా మైదానం గణేశ్​ చతుర్థి వేడుకల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మంగళవారం అర్ధరాత్రి ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్​ చేస్తూ అంజుమన్​ ఇస్లాం సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈలోపల ఈద్గా మైదాన్​ ఉత్సవ కమిటీ సభ్యులు గణపయ్య చిన్న విగ్రహాన్ని హడావుడిగా ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు.

ఈద్గా మైదాన్​లో గణేశుడి ఉత్సవాలు

అసలేం జరిగిందంటే?
హుబ్లీలోని ఈద్గా మైదాన్​లో గత కొన్నేళ్లుగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈ సారి అక్కడ పూజలు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ అంజుమన్​ ఇస్లాం సంస్థ.. కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. వాటిని పరిశీలించిన ఆ రాష్ట్ర హైకోర్టు.. మంగళవారం అర్ధరాత్రి కొట్టిపారేసింది. గణేశ్​ ఉత్సవాలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. అయితే అంజుమన్​ ఇస్లాం సంస్థ.. సుప్రీంకోర్టులో అప్పీల్​ దాఖలు చేసింది.

అది తెలిసిన ఈద్గా మైదాన్​ ఉత్సవ కమిటీ సభ్యులు.. హడావుడిగా గణేశుడి చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తుక్షవీర మఠం నుంచి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్లి ప్రతిష్ఠించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ముందుగా ప్లాన్ చేశారు. కానీ అంజుమన్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల ఉదయం 7.30 గంటలకే వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సంజీవ్ బడేస్కర్ ఆధ్వర్యంలో పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు హిందూ సంఘాల నాయకులు పాల్గొనడం వల్ల ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇవీ చదవండి: ఘనంగా గణేశ్​ చతుర్థి.. గాజుసీసాలో చిన్ని గణపతి.. 3వేల లడ్డూలతో సైకత శిల్పం

పుష్ప, ఆర్​ఆర్​ఆర్​ మేనియా.. గణపయ్య ఇక తగ్గేదే లే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.