ETV Bharat / bharat

17 ఏళ్లకే ఆంగ్లేయులకు వణుకు పుట్టించిన 'అనంతుడు' - ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్

Anant Laxman Kanhere: బ్రిటీష్​ పాలనలో భారత సానుభూతిపరుడిగా గుర్తింపు పొందాడు కలెక్టర్​ ఎ.ఎం.టీ జాక్సన్. కానీ అతడిని తెలుగు మూలాలు ఉన్న ఓ 17 ఏళ్ల యువకుడు కాల్చి చంపాడు. అతనే అనంత లక్ష్మణ్​ కన్హేరె. అతని జీవితంలో జరిగిన ఆ మూడు సంఘటనలు.. ఆంగ్లేయుల్లో కొందరు అధికారులు నేరుగా దెబ్బతీస్తే, మరికొందరు మంచిగా ఉంటూనే దొంగదెబ్బ కొడతారని అనే అనుమానాలకు సమాధానంగా నిలిచాయి. ఇంతకీ ఏంటా సంఘటనలు?

Anant Laxman Kanhere
అనంత లక్ష్మణ్‌ కన్హేరె
author img

By

Published : Apr 1, 2022, 9:52 AM IST

Anant Laxman Kanhere: అతనో బ్రిటిష్‌ కలెక్టర్‌. పేరు ఎ.ఎం.టి.జాక్సన్‌. భారతీయ జానపదాలు, చరిత్ర, పురాణాలను చదవడానికి సంస్కృతం నేర్చుకుని, పండిత్‌ జాక్సన్‌గా ప్రసిద్ధుడయ్యాడు. నాసిక్‌ పాలనాధికారిగా పేరుతెచ్చుకున్నాడు. అలాంటి జాక్సన్‌ను అనంత లక్ష్మణ్‌ కన్హేరె అనే 17 ఏళ్ల భారతీయుడు కాల్చి చంపాడు. తెలుగు మూలాలు ఉండి.. నిజామాబాద్‌లో చదువుకున్న ఆ నూనూగు మీసాల యువకుడు ఈ సాహస చర్యకు ఎందుకు ఉపక్రమించాడు. తర్వాత ఏమయ్యాడు?

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్‌ తాలూకా అంజని గ్రామంలో 1892 జనవరి 7న అనంత లక్ష్మణ్‌ కన్హేరె జన్మించారు. నిజామాబాద్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం, ఔరంగాబాద్‌లో ఆంగ్లం చదువుకున్నారు. చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ నిశితంగా గమనించే అలవాటున్న ఆయనపై బ్రిటిష్‌ పాలన తీవ్ర ప్రభావం చూపింది. ఆంగ్లేయుల్లో కొందరు అధికారులు నేరుగా దెబ్బతీస్తారని, మరికొందరు మంచిగా ఉంటూనే దొంగదెబ్బ కొడతారని ఆయన నమ్మకం. అనంతుని అనుమానాలకు సమాధానంగా ఎన్నో ఘటనలు జరిగాయి.

  • సంఘటన 1: నాసిక్‌లో ఓ బ్రిటిష్‌ పోలీసు అధికారి పోలో ఆడుతుండగా బంతి రోడ్డుపైకి ఎగిరిపడింది. అటుగా వెళ్తున్న రైతును చూసి, బంతిని తనవైపు వేయాలని ఆదేశించాడు. అసలే పోలీసులంటే భయం, ఆయన ఆంగ్లంలో చెప్పిందేమిటో అర్థం కాకపోవడం వల్ల రైతు బిక్కచచ్చిపోయాడు. తన ఆదేశాలను ధిక్కరించాడనే కోపంతో పోలీసు అధికారి రైతును తీవ్రంగా కొట్టాడు. ఆ అభాగ్యుడు మరుసటి రోజు ప్రాణాలు వదిలాడు. స్థానికులు ఫిర్యాదు చేయగా విచారించిన కలెక్టర్‌ జాక్సన్‌... రైతుపై పోలీసు అధికారి దాడిని అసంకల్పిత చర్యగా నిర్ధారించాడు. అతనికి శిక్ష అవసరం లేదని తీర్పిచ్చాడు. రైతు కుటుంబానికి రూ.30 పరిహారం మంజూరు చేశాడు.
  • సంఘటన 2: నాసిక్‌లో దసరా ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తారు. యువకులు కత్తులు, గొడ్డళ్లను చేతబూని.. హరహర మహాదేవ, వందేమాతరం నినాదాలను చేస్తారు. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో వందేమాతర నినాదం మారుమోగితే కొత్త ఉద్యమకారులు పుట్టుకొస్తారనే నెపంతో కలెక్టర్‌ జాక్సన్‌.. పోలీసుల పర్యవేక్షణలో నిశ్శబ్ద ర్యాలీలు నిర్వహించుకోవాలని ఆదేశించాడు.
  • సంఘటన 3: నాసిక్‌లో అభినవ భారత్‌ సొసైటీని స్థాపించిన గణేష్‌ దామోదర సావర్కర్‌... కవి గోవింద్‌పై ఒక పుస్తకాన్ని ప్రచురించారు. దీన్ని సాకుగా చూపుతూ బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యువకులను రెచ్చగొడుతున్నారని ఆయన్ని అరెస్టు చేశారు. దేశద్రోహం అభియోగంపై కలెక్టర్‌ చేస్తున్న విచారణ తుది దశకు చేరుకుంది. సావర్కర్‌కు దేశ బహిష్కరణ విధిస్తారని రూఢి అయింది.

ఇలాంటి ఎన్నో ఘటనలు అనంతుడిలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి. బ్రిటిష్‌ పాలనను మరింత పటిష్ఠం చేయడానికే కలెక్టర్‌ జాక్సన్‌ భారత సానుభూతిపరుడి ముసుగు ధరించాడని నమ్మేవారు. ముఖ్యంగా అభినవ భారత్‌పై ఉక్కుపాదం మోపడానికి కలెక్టర్‌ కంకణం కట్టుకున్నట్లు రూఢి చేసుకున్నారు. దాంతో జాక్సన్‌ను 1910 జనవరిలో హత్య చేయడం ద్వారా బ్రిటిషర్లకు గట్టి హెచ్చరిక పంపాలని అభినవ్‌ భారత్‌కు చెందిన కృష్ణాజీ కార్వె సారథ్యంలోని ఓ బృందం నిర్ణయించింది. అవకాశాన్ని తనకివ్వాలని లక్ష్మణ్‌ కోరారు. ఒకవేళ లక్ష్మణ్‌ ప్రయత్నం విఫలమైతే క్రిష్ణాజీ కార్వె, వినాయక్‌ దేశ్‌పాండే సైతం సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. హత్య తర్వాత తనను తాను అంతమొందించుకోవాలని లక్ష్మణ్‌ నిర్ణయం తీసుకున్నారు. అదేసమయంలో అనూహ్యంగా కలెక్టర్‌ జాక్సన్‌కు ముంబయి కమిషనర్‌గా బదిలీ అయింది. స్థానిక ప్రముఖులు ఆయన గౌరవార్థం 1909, డిసెంబరు 21న నాసిక్‌లోని విజయానంద్‌ థియేటర్‌లో నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అదే అదనుగా అక్కడికి చేరుకుని లక్ష్మణ్ తుపాకీతో జాక్సన్‌ను కాల్చి చంపారు. తనను తాను కాల్చుకోవడానికి యత్నించిన లక్ష్మణ్‌ను అక్కడున్న వారు పట్టుకున్నారు.

Anant Laxman Kanhere
అనంత లక్ష్మణ్‌ కన్హేరె

ముగ్గురికీ ఒకేసారి ఉరిశిక్ష అమలు

విచారణ అనంతరం 1910 ఏప్రిల్‌ 19న అనంత లక్ష్మణ్‌, క్రిష్ణాజీ, దేశ్‌పాండేలకు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ ముగ్గురు వీరుల అస్థికలు సైతం ఎవ్వరికీ అప్పగించకుండా ఠాణే సమీపంలోని సముద్రంలో విసిరేశారు. అప్పటికే దేశద్రోహం కేసు విచారణలో ఉన్న గణేష్‌ సావర్కర్‌కు జీవితకాల జైలుశిక్ష విధించారు. కొంతకాలానికి ఆయన సోదరుడు వినాయక్‌ సావర్కర్‌ను లండన్‌ నుంచి నాసిక్‌ రప్పించి, విచారణ చేసిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన్ని కాలాపానీ జైలుకు పంపించింది.

  • అనంత లక్ష్మణ్‌, క్రిష్ణాజీ కార్వే, దేశ్‌పాండేల సాహసం, విచారణ విధానం మొత్తం 'నాసిక్‌ కుట్ర' పేరిట వినుతికెక్కింది. ఈ చారిత్రక ఘట్టం కలకాలం నిలిచి ఉండేలా వారి సాహసగాథను ఇతివృత్తంగా తీసుకుని మరాఠీలో '1909' పేరిట సినిమాను నిర్మించారు. 1909 డిసెంబరు 21కి గుర్తుగా సినిమాను 2013 డిసెంబరు 21నే నాసిక్‌ విజయానంద్‌ థియేటర్‌లోనే ముందస్తుగా ప్రదర్శించారు.

ఇదీ చూడండి : రాజ్యసభపై నితీశ్​ ఆసక్తి.. తదుపరి ఉపరాష్ట్రపతి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.